»   » అరెస్ట్: హీరోయిన్ భాగోతం బట్టబయలు, జల్సా జీవితం

అరెస్ట్: హీరోయిన్ భాగోతం బట్టబయలు, జల్సా జీవితం

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాయ్ ఫ్రెండుతో కలిసి జనాలను మోసం చేస్తూ జల్సా జీవితం గడుపుతున్న ముంబైకి చెందిన సినీ నటిని పోలీసులు అరెస్టు చేసారు. సదరు నటి పేరు లీనా మరియా పాల్(26), బాయ్‌ఫ్రెండ్ శేఖర్ చంద్రశేఖర్(25)తో కలిసి అమ్మడు ఈ మోసాలకు పాల్పడింది. వేలాది మంది నుండి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసాలకు పాల్పడ్డట్లు వెల్లడింది. లీనా మరియా పాల్ 2009లో వచ్చిన మోహన్ లాల్ మూవీ రెడ్ చిల్లీస్, జాన్ అబ్రహం నటించిన ‘మద్రాస్ కేఫ్' చిత్రాల్లో నటించింది.

ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ పెడతాం, మీ పెట్టుబడిని రెండింతలు చేస్తాం అంటూ వీరు చెప్పిన మ వెయ్యి మందికి పైగా కోట్లాది రూపాయలు వీరి వద్ద ఇన్వెస్ట్ చేసారు. అయితే వారు కంపెనీ మొదలు పెట్టకుండా ఆ డబ్బుతో జల్సా జీవితం గడపడం మొదలు పెట్టారు. ఆ డబ్బుతో వారు ఇప్పటి వరకు 9 లగ్జరీ కార్లు, 117 ఇంపోర్టెడ్ గడియారాలు, ఓ స్పోర్ట్స్ బైక్, 12 సెల్ ఫోన్లు, మరికొన్ని ఖరీదైన వస్తువులు కొన్నారు.

Actress Leena Maria Paul arrest

ముంబైలోని ఎకనమిక్ అఫెన్స్ వింగ్ వీరి మోసాన్ని పసిగట్టింది. ఈ కేసులో లీనా మరియా పాల్, ఆమె బాయ్ ఫ్రెండ్ చంద్రశేఖర్ తో పాటు మరో నాలుగురు ఆదిల్ జైపురి(24), అక్తర్ జైపురి(55), సల్మాన్ రిజ్వి(28), నాసిర్ జైపురి(50)ని అరెస్టు చేసారు. ఈ మొత్తం మోసాలకు మాస్టర్ మైండ్ చంద్రశేఖర్ అని ఎకనమిక్ అఫెన్స్ వింగ్ ఆఫీసర్లు గుర్తించారు.

గుర్‌గావ్‌లో ‘లయన్ ఓక్ ఇండియా' పేరుతో ఓ కార్యాయలం ఓపెన్ చేసిన వీరు...నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు స్వీకరిస్తున్నారు. ఇందులో లక్కీ నెంబర్ 05, స్పెషల్ హార్వెస్ట్ వీక్, సూపర్ హార్వెస్ట్ ప్లస్, వీక్లీ న్యూఇయర్ బొనాంజ పేరుతో పలు స్కీములు నడుపుతున్నారు. రూ. 10 కోట్ల వరకు డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అయితే కొందరికి డబ్బులు తిరిగి ఇవ్వక పోవడంతో విషయం బయటకు పొక్కింది.

English summary
ctress and her boyfriend have been arrested for cheating more than 1,000 people of crores of rupees to quench their thirst to live the high life.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu