»   » చిరంజీవి తర్వాత ఆ ఇద్దరే... దిల్ రాజు కామెంట్స్ వెనక కారణం ఏమిటి?

చిరంజీవి తర్వాత ఆ ఇద్దరే... దిల్ రాజు కామెంట్స్ వెనక కారణం ఏమిటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ సంక్రాంతి పండగ నిర్మాత దిల్ రాజుకు కూడా బాగా కలిసొచ్చింది. బాక్సాఫీసు వద్ద రెండు పెద్ద సినిమాల ప్రభంజనం కొనసాగుతున్న తరుణంలోనూ 'శతమానం భవతి' సినిమాను రిలీజ్ చేసి సక్సెస్ అందుకున్న దిల్ రాజు... ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు,.

ఎన్టీఆర్, ఎఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు వెండి తెరను ఏలుతున్న రోజుల్లో తెలుగు సినిమా పరిశ్రమకు గోల్డెన్ డేస్ నడిచాయి. ఆ తర్వాత ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన చిరంజీవి తెలుగులో టాప్ పొజిషన్ కు చేరుకుని పరిశ్రమకు భారీ విజయాలను అందించారు. ఆయన తర్వాత ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా పరిశ్రమలో నిలదొక్కుకున్న స్టార్స్ రవితేజ, నాని మాత్రమే అని దిల్ రాజు చెప్పుకొచ్చారు.

అఫ్ కోర్స్ ... దిల్ రాజు చెప్పిన విషయం వాస్తవమే. అయితే 'శతమానం భవతి' సినిమా ప్రమోసన్లలో దిల్ రాజు ఈ ప్రస్తావన తేవడానికి కారణం ఏమిటి? అనేది చర్చనీయాంశం అయింది.

నాని - దిల్ రాజు

నాని - దిల్ రాజు

దిల్ రాజు నాని హీరోగా నిర్మించిన ‘నేను లోకల్' చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దిల్ రాజు ఈ కామెంట్స్ చేసినట్లు స్పష్టం అవుతోంది. దిల్ రాజు ఏ చేసినా, ఏం మాట్లాడినా కారణం లేకుండా చేయరు కదా...

ఇప్పుడిదో కొత్త ట్రెండా? మొన్న రామ్ చరణ్, ఇపుడు దిల్ రాజు కూడా (ఫోటోస్)

ఇప్పుడిదో కొత్త ట్రెండా? మొన్న రామ్ చరణ్, ఇపుడు దిల్ రాజు కూడా (ఫోటోస్)

సినిమా ప్రమోషన్ల విషయంలో రోటీన్ గా కాకుండా కొత్త కొత్త ఆలోచనలకు తెరలేపుతున్నారు తెలుగు సినీ ప్రముఖులు, ఇటీవల రామ్ చరణ్ ‘ఖైదీ నెం 150' ప్రమోషన్ విషయంలో అనుసరించిన విధానాన్నే దిల్ రాజు కూడా ఫాలో అయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

హీరో నాని...జండూబామ్‌కు కూడా తలనొప్పి తెప్పిస్తాడంటూ కామెంట్

హీరో నాని...జండూబామ్‌కు కూడా తలనొప్పి తెప్పిస్తాడంటూ కామెంట్

‘వీడు మాములోడు కాదే. జండూబామ్‌కు కూడా తలనొప్పి తెప్పించే రకం' అంటూ నాని ని ఆయన అనేసారు. ఎవరు ఇంతకీ నానిపై అంత కామెంట్ చేసింది ఎవరు అంటారా...పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ఆ రెండు పెద్ద సినిమాల మధ్య దిల్ రాజు ‘శతమానం భవతి' పరిస్థితి ఇదీ...!

ఆ రెండు పెద్ద సినిమాల మధ్య దిల్ రాజు ‘శతమానం భవతి' పరిస్థితి ఇదీ...!

ఈ సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమాతో, నటసింహం బాలయ్య తన 100వ సినిమాతో బాక్సాఫీసు రేసులో దూకడంతో వీరిద్దరితో పోటీ పడలేని చాలా సినిమాలు వాయిదా పడ్డాయి. అయితే నిర్మాత దిల్ రాజు మాత్రం ‘శతమానం భవతి' చిత్రాన్ని రిలీజ్ చేసారు. ఆ సినిమా పరిస్థితి బాక్సాపీసు వద్ద ఎలా ఉందనే వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Prodicer Dil Raju: 'We have seen golden era when NTR, ANR, Krishna, Sobhan Babu and Krishnam Raju are at their prime. Later, Chiranjeevi reached top position sans any background. After him, It's only Raviteja and Nani who attained Star Status without a godfather'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu