»   » కొత్త బెంట్లీ కారుకు ఫ్యాన్సీ నెంబర్: పోటీపడి భారీగా ఖర్చు పెట్టిన బాలయ్య!

కొత్త బెంట్లీ కారుకు ఫ్యాన్సీ నెంబర్: పోటీపడి భారీగా ఖర్చు పెట్టిన బాలయ్య!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి నటసింహం బాలకృష్ణ తన కొత్త బెంట్లీ కారు కోసం ఫ్యాన్సీ నెంబర్ సొంతం చేసుకున్నారు. పోటాపోటీగా సాగిన వేలంలో బాలయ్య అత్యధిక మొత్తం చెల్లించి తనకు కావాల్సిన నెంబర్ చేజిక్కించుకున్నారు.

బాలయ్య పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పైసా వసూల్' సినిమా షూటింగ్ నిమిత్తం పోర్చుగల్‌లో ఉండగా.... కుటుంబ సభ్యులంతా అక్కడికే వెళ్లి ఆయన పుట్టినరోజు సెలబ్రేట్ చేశారు. ఈ సందర్బంగా బాలయ్య ఇద్దరు కూతుళ్లు బ్రాహ్మణి, తేజస్విని నాన్నకు ఎంతో ఇష్టమైన బెంట్లీ కారను బహుమతిగా అందజేసిన సంగతి తెలిసిందే.

బాలయ్య కారు నెం ఇదే..

బాలయ్య కారు నెం ఇదే..

హైదరాబాద్‌లో ఇటీవల ఆర్టీఏ అధికారులు కొన్ని ఫ్యాన్సీ నెంబర్లను వేలానికి పెట్టారు. ఈ వేలంలో బాలయ్య టీఎస్09 ఇయు 0001 అనే నెంబర్ కైవశం చేసుకున్నారు.

పోటీపడి ఖర్చు పెట్టిన బాలయ్య

పోటీపడి ఖర్చు పెట్టిన బాలయ్య

న్యూమరాలజీ, జ్యోతిష్యం, వాస్తును బాగా నమ్మే బాలయ్య..... తనకు బాగా కలిసొస్తుందనే ఉద్దేశ్యంతో టీఎస్09 ఇయు 0001 నెంబర్ కోసం వేలంలో పోటీ పడ్డారు. రూ. 7.77 లక్షలు చెల్లించి సొంతం చేసుకున్నారు.

బెంట్లీ కారు ఖరీదు ఎంత?

బెంట్లీ కారు ఖరీదు ఎంత?

బాలయ్యకు తన ఇద్దరు కూతుర్లు ప్రజెంట్ చేసిన బెంట్లీ కారు ధర రూ. 4 నుండి 4.5 కోట్లు ఉంటుందని అంచనా. బాలయ్య వద్ద ఉన్న కార్లలో ఇదే అత్యంత ఖరీదైన కారు.

బర్త్ డే గిఫ్ట్: బాలయ్య కోసం కూతుళ్ల ఖరీదైన బహుమతి (ఫోటోస్)

బర్త్ డే గిఫ్ట్: బాలయ్య కోసం కూతుళ్ల ఖరీదైన బహుమతి (ఫోటోస్)

బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ఖరీదైన బెంట్లీ కారును బహుమతి ఇచ్చారు బ్రాహ్మణి, తేజస్వి. అక్కడికి కారు తీసుకెళ్లేరు కాబట్టి కారు తాళాల బాక్స్‌ను తండ్రికి అందించారు.

ఫోటోస్ కోసం క్లిక్ చేయండి.

English summary
Balakrishna pays Rs 7.77 lakh for fancy Number for his New Bentley Car. Nandamuri Balakrishna's Daughters Brahmani and Tejaswini gifted Bentley to their father on the eve of his birthday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu