Don't Miss!
- News జగన్‌ను ఓడించడానికి ఒక్కటైన ఇద్దరు సీఎంలు
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Lata Mangeshkar Heath Update: ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే..
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ తీవ్ర అస్వస్థతకు గురయిన సంగతి తెలిసిందే. వయసు మీద పడటం, ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ఆమెను ముంబైలోని బ్రీచ్‌కాండీ ఆసుపత్రిలో చేర్పించారు ఆమె కుటుంబ సభ్యులు. ప్రస్తుతం లతా మంగేష్కర్ వయసు 90 సంవత్సరాలు.
శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని ఆమె చెప్పడంతో.. వెంటనే అప్రమత్తమైన ఆమె కుటుంబ సభ్యులు ముంబయిలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కొన్ని రోజులుగా ఆమెకు శ్వాసకోశ సమస్యలు ఉండటంతో హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ అందించారు. చాలా రోజులుగా ఆసుపత్రిలోనే చికిత్స పొందిన ఆమె.. తిరిగి ఇల్లు చేరింది.
లత మంగేష్కర్ న్యూమోనియా ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. సుమారు 28 రోజులపాటు ఆసుపత్రిలోనే ఆమెకు చికిత్స జరిగింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆమెను ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచారు. న్యుమోనియా, ఛాతిలో ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆమె ఇప్పుడు కోలుకున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
దీంతో లతా మంగేష్కర్‌ను డిశ్చార్జ్ చేశాయి ఆసుపత్రి వర్గాలు. ఈ సందర్భంగా స్పందించిన లతా మంగేష్కర్.. తానిప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, తన క్షేమాన్ని కాంక్షించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అని తెలిపారు. సింగర్‌గా లతా మంగేష్కర్ కెరీర్ కెరీర్ చాలా సుదీర్ఘమైనది.
ఇప్పటికే దాదాపు 25వేలకు పైగా సోలో పాటలు పాడి గిన్నీస్ రికార్డు క్రియేట్ చేసింది లతా. భారత ప్రభుత్వం చేత పద్మభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే, భారత రత్న, పద్మ విభూషణ్ అవార్డులతో సత్కరించబడింది లతా మంగేష్కర్.