Don't Miss!
- News రాహుల్ సహా నేడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న కీలక నేతలు వీరే..
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఇటలీలో కాజల్-మహేష్ బాబు హల్ చల్..!
'పోకిరి" వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మహేష్-పూరి జగన్నాథ్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'బిజినెస్ మ్యాన్". ఈ చిత్రంలోని డైలాగ్స్ బైటకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ టీజర్ ని ఈ నెల 11న అఫిషియల్ గా దర్శకనిర్మాతలు విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ అది రెండు రోజుల ముందే అంటే ఈ రోజు విడుదలై పలు వెబ్ సైట్స్ లో హల్ చల్ చేస్తున్నాయి. వెబ్ సైట్స్ లో 37సెకన్స్ కనిపిస్తున్న ఈ టీజర్సే అలా ఉంటే ఇక సినిమా ఏరేంజ్ లో వుంటుందో జనవరి వరకూ వేచి చూడాల్సిందే. అఫిషియల్ గా 11 .11 .11 తేదీన విడుదలయ్యే ఈ సినిమా ఫస్ట్ లుక్ ఒరిజినల్ కోసం అందరూ ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.
కాగా త్వరలో ప్రిన్స్ మహేష్ బాబు ఇటలీ లో నృత్యం చేయనున్నాడు. గందరగోళంగా ఉందా ..? అదేమీ లేదులెండి. మహేష్ 'బిజినెస్ మాన్" చిత్ర యూనిట్ ఈ నెల సెకండ్ వీక్ లో ఇటలీ వెళ్లనుంది. అక్కడ మహేష్ బాబు - కాజల్ పై రెండు సాంగ్స్ చిత్రీకరించనున్నారు. శర వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ మూవీ 11 జనవరి 2012 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ముంబై మాఫియ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా సాగనుంది. ఆర్ ఆర్ మూవీ మకర్స్ బ్యానర్ పై నిర్మితమౌతోన్న ఈ సినిమాకు సంగీతం తమన్ అందిస్తున్నారు.