»   » ‘కాటమరాయుడు’ పోస్ట్, బూతు కామెంట్స్: శివ బాలాజీ కంప్లైంట్!

‘కాటమరాయుడు’ పోస్ట్, బూతు కామెంట్స్: శివ బాలాజీ కంప్లైంట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న 'కాటమరాయుడు' చిత్రంలో ప్రముఖ నటుడు శివ బాలాజీ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈచిత్రంలో శివ బాలాజీ పవన్ కళ్యాణ్ తమ్ముడి పాత్రలో నటిస్తున్నారు.

ప్రస్తుతం శివ బాలాజీ, అలీ, కమల్ కామరాజు తదితరులు డబ్బింగ్ కార్యక్రమాల్లో బిజీగా గడపుతున్నారు. ఈ సందర్భంగా శివ బాలాజీ ఫేస్ బుక్ లో 'కసిగా పని చేస్తున్న కాటమరాయుడు టీం' అంటూ ఓ పోస్టు పెట్టారు.

అయితే ఈ పోస్టుపై ఓ వ్యక్తి అసభ్యమైన కామెంట్స్ చేసారు. దీనిపై శివ బాలాజీ గచ్చి బౌలిలోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసారు.

అసభ్య కామెంట్స్ ఇవే

అసభ్య కామెంట్స్ ఇవే

నాపై నువ్వు ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేసావు. నువ్వు నాకు సమాధానం చెప్పి తీరాలి. దీనిపై నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తాను అంటూ... గురువారం ఓ పోస్టు పెట్టిన శివ బాలాజీ, శుక్రవారం తాను చెప్పిన విధంగానే ఫిర్యాదు చేసారు.

‘కసిగా పని చేస్తున్న కాటమరాయుడు టీం

‘కసిగా పని చేస్తున్న కాటమరాయుడు టీం

కాటమరాయుడు డబ్బింగ్ సందర్భంగా శివ బాలాజీ ఫేస్ బుక్ లో ‘కసిగా పని చేస్తున్న కాటమరాయుడు టీం' అంటూ పెట్టిన పోస్టు ఇదే. దీనిపైనే సదరు వ్యక్తి అసభ్య కామెంట్స్ చేసారు.

‘కాటమరాయుడు'కి సర్ప్రైజ్, జనసేనాని శివ బాలాజీ తయారు చేయించిన కత్తి

‘కాటమరాయుడు'కి సర్ప్రైజ్, జనసేనాని శివ బాలాజీ తయారు చేయించిన కత్తి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'కాటమరాయుడు' చిత్రం షూటింగులో భాగంగా సెట్లో ఉండగా సర్ప్రైజ్ గిఫ్ట్ అందుకున్నారు. సినిమాలో పవన్ కల్యాణ్‌కు తమ్ముడిగా నటిస్తున్న శివబాలాజీ ఆయన కోసం ప్రత్యేకంగా ఓ కత్తిని తయారు చేసి బహుమతిగా ఇచ్చారు. అందుకు సంబంధించిన ఫోటోల కోసం క్లిక్ చేయండి.

నీకోసం ఏమన్నా చెయ్యాలోయ్.... అంటూ పవన్ కళ్యాణ్ శివ బాలాజీ కోసం ఏం చేసాడో తెలుసా?

నీకోసం ఏమన్నా చెయ్యాలోయ్.... అంటూ పవన్ కళ్యాణ్ శివ బాలాజీ కోసం ఏం చేసాడో తెలుసా?

'కాటమరాయుడు' సెట్స్ లో జరిగిన ఓ సంఘటన ఇపుడు హాట్ టాపిక్ అయింది. ఈ సినిమాలో నటిస్తున్న శివ బాలాజీ పుట్టినరోజు సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన తన ఎఫ్‌బి అకౌంట్ ద్వారా వెల్లడించారు... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Siva Balaji complaint to cyber crime police againist abusive comments on Facebook.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu