twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2 అవర్స్ లవ్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Rating: 2.75/5

    పెళ్లిచూపులు తర్వాత విజయ్ దేవరకొండ కోసం కథ రాసుకొన్నాను అంటూ దర్శకుడు, హీరో, రచయిత శ్రీ పవార్ చేసిన కామెంట్స్ 2 హవర్స్ లవ్ సినిమాపై ఆసక్తిని రేపాయి. అర్జున్‌రెడ్డి, RX 100 తర్వాత ఇంటెన్సెటీ ఉన్న ప్రేమ కథలకు మంచి ఆదరణ లభించింది. ఆ క్రమంలోనే వచ్చిన చిత్రం 2 అవర్స్ లవ్. ఇక రిలీజ్‌కు ముందు వచ్చిన టీజర్లు, ట్రైలర్‌ సినిమాపై ఫీల్‌గుడ్‌ ఒపీనియన్‌ను కలిగించేలా చేశాయి. న్యూ జనరేషన్ లవ్‌స్టోరి అనే ముద్ర వేసుకొని వచ్చిన 2 అవర్స్ లవ్ ఎలాంటి సంతృప్తిని కలిగించింది. హీరోగా, దర్శకుడిగా శ్రీ పవార్ ఎలా మెప్పించాడనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథ, కథనాలు సమీక్షించాల్సిందే..

    2 అవర్స్ లవ్ కథ..

    2 అవర్స్ లవ్ కథ..

    సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అధయ్ (శ్రీ పవార్) కాఫీ షాప్‌లో పనిచేసే నయన (కృతి గార్గ్)తో ప్రేమించుకొంటారు. నయన‌ను అధయ్‌ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. అధయ్‌లో ఉండే పొసెసివ్‌నెస్ నయనకు ఇబ్బందిగా మారుతుంది. దాంతో రోజుకు రెండు గంటలు మాత్రమే ప్రేమించుకుందాం అంటూ కండిషన్ పెడుతుంది.

    ప్రేమకథలో మలుపులు

    ప్రేమకథలో మలుపులు

    ప్రేమను కండిషన్ పెడితే ఇద్దరి మధ్య ప్రేమ ముందుకెళ్తుందా? నయన పెట్టే టార్చర్‌ను అధయ్ ఎలా భరించాడు? 2 గంటలు మాత్రమే ఎందుకు ప్రేమిస్తానని కండిషన్ పెట్టింది? విలన్ ముఠాతో నయనకు కలిగిన ముప్పు ఏమిటి? విలన్ ముఠా నుంచి ప్రాణంగా ప్రేమించే నయనను ఎలా కాపాడుకొన్నాడు? అనే ప్రశ్నలకు సమాధానమే 2 అవర్స్ లవ్ కథ.

    2 అవర్స్ ప్రేమ ఎలా ఉందంటే

    2 అవర్స్ ప్రేమ ఎలా ఉందంటే

    సరికొత్త పాయింట్‌తో యువతరానికి నచ్చే విధంగా చెప్పిన కథ 2 అవర్స్ లవ్. ప్రస్తుతం వస్తున్న ప్రేమకథా చిత్రాలకు భిన్నంగా కాస్త మసాల దట్టించి చెప్పిన స్టోరి ఇది. ముద్దు సీన్లతో బోరు కొట్టించకుండా నేరుగా కథలోకి వెళ్లిపోవడంతో సినిమాపై క్యూరియాసిటీ పెరుగుతుంది. కొత్తవాడైనా శ్రీ పవార్ కథను తన భుజాలపై మోశాడు. కేవలం నటనతోనే కాకుండా దర్శకత్వ బాధ్యతను చక్కగా పోషించాడు. సెకండాఫ్‌లో కథలో వేగాన్ని పెంచి ఉంటే సినిమా మరింత ఫీల్‌గుడ్‌గా మారేది. కొన్ని సన్నివేశాలు కథా వేగాన్ని దెబ్బతీశాయనే చెప్పవచ్చు. ఇప్పుడొస్తున్న ప్రేమకథా సినిమాలతో పోల్చుకొంటే డెఫినెట్‌గా 2 అవర్స్ లవ్ ఢిఫరెంట్ సినిమా అనే కాకుండా యూత్‌ను ఆకట్టుకునే ఫీల్‌గుడ్ మూవీ అని ఎలాంటి సందేహం లేకుండా చెప్పవచ్చు.

    హీరో, డైరెక్టర్, రచయితగా శ్రీ పవార్

    హీరో, డైరెక్టర్, రచయితగా శ్రీ పవార్

    హీరోగా శ్రీ పవార్ హావభావాలు బాగున్నాయి. నటనపరంగా ఇంకా మెరుగుపరుచుకొవాల్సిన అవసరం ఉంది. డ్యాన్సులు, ఫైట్స్ బాగానే చేశాడు. దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలు చూసుకొంటూ హీరోగా మంచి ప్రతిభను కనబరచడం సాధారణమైన విషయం కాదు. ఈ విషయంలో శ్రీ పవార్ నూటికి నూరుశాతం విజయం సాధించాడు. సారీ చెప్పే ప్రతీ సారి కొంత డబ్బు ఇవ్వాలనే పాయింట్‌ను దర్శకుడిగా కొత్తగా చెప్పాడు. కథను నడిపిన తీరు మెప్పించేలా ఉంటుంది. ప్రేమ కథకు కావాల్సిన సర్‌ప్రైజ్‌లు చాలానే కనిపించేలా జాగ్రత్తలు తీసుకోవడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. రచయితగా కూడా శ్రీ పవార్ ఆకట్టుకొంటాడు.

    కృతి గార్గ్ ఫెర్ఫార్మెన్స్

    కృతి గార్గ్ ఫెర్ఫార్మెన్స్

    ఇక హీరోయిన్ కృతి గార్గ్ నయన పాత్రలో ఒదిగిపోయింది. హీరోను టార్చర్ పెట్టే సన్నివేశాల్లో బాగా రాణించింది. రొమాంటిక్, ముద్దు సీన్లలో బెరుకు కనిపించకుండా అదరగొట్టేసింది. నటనపరంగా, డైలాగ్ డెలివరీ విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడి ఉంటే నయన పాత్రకు మరింత సహజత్వం తోడయ్యేదనిపించింది. తనికెళ్ల భరణి నటన సినిమాకు మరో బలమని చెప్పవచ్చు. మిగితా పాత్రధారులు తమ పరిధి మేరకు మెప్పించారు.

    సాంకేతిక విలువలు

    సాంకేతిక విలువలు

    సాంకేతికంగా 2 అవర్స్ లవ్‌కు సినిమాటోగ్రఫి, మ్యూజిక్ అదనపు బలం. ప్రవీణ్ వీ సినిమాటోగ్రఫి బాగుంది. ప్రతీ ఫ్రేమ్‌ను అందంగా తెరకెక్కించాడు. గ్యానీ సింగ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, పాటలు కొత్తగా, ట్రెండీగా ఉన్నాయి. శ్యాం సుబ్బు ఎడిటింగ్ బాగుంది. కాకపోతే సెకండాఫ్‌పై కొంత కఠినంగా వ్యవహరించాల్సింది. శ్రీనిక క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓ రిచ్ సినిమాగా రూపొందించడంలో సక్సెస్ అయ్యారు.

    తుదితీర్పు

    తుదితీర్పు

    ఫైనల్‌గా, అన్ని రకాల హంగులు, మసాల జోడించి.. యూత్‌కు నచ్చే విధంగా చేసిన చిత్రం 2 అవర్స్ లవ్. శ్రీ పవార్, కృతి గార్గ్ ఫెర్ఫార్మెన్స్ ఆకట్టుకొంటాయి. దర్శకుడిగా శ్రీ పవార్ ఎంచుకొన్న పాయింట్ సరికొత్తగా ఉంటుంది. ఫ్రెష్‌ కథ, కథనాలు, పుష్కలంగా సాంకేతిక విలువులు ఉండటం ప్రేక్షకులకు పైసా వసూలు చిత్రంగా మారింది. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా, ఫీల్ గుడ్ మూవీకి ఏమాత్రం తీసిపోకుండా ఉంటుందనడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. కేవలం నటన, దర్శకత్వం, రచయితగా శ్రీ పవార్ చూపిన ప్రతిభకు ఇస్తున్న రేటింగ్: 2.75/5

    పాజిటివ్, నెగిటివ్ పాయింట్స్

    పాజిటివ్, నెగిటివ్ పాయింట్స్

    బలం, బలహీనత
    కథ, కథనాలు
    లవ్ ట్రాక్
    పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్
    నిర్మాణ విలువలు
    సినిమాలో వచ్చే ట్విస్టులు

    నెగిటివ్ పాయింట్స్
    సెకండాఫ్‌లో కొంత భాగం
    మితిమీరిన లిప్‌లాక్స్

    తెర ముందు, తెర వెనుక

    తెర ముందు, తెర వెనుక

    నటీనటులు : శ్రీపవార్, కృతి గర్గ్, తనికెళ్ళభరణి, వర్ధన్, నర్సింగ్ యాదవ్ తదితరులు
    సినిమాటోగ్రఫి:
    సంగీతం : గ్యాని సింగ్
    ఎడిటింగ్: శ్యాం సుబ్బు
    నిర్మాణ సంస్థ : శ్రీనిక క్రియేటివ్ వర్క్స్
    దర్వకత్వం : శ్రీ పవార్
    రిలీజ్ డేట్: 2019-09-06

    English summary
    Sri Pawar's 2 hours love movie set to release on September 6th. In this occassion, Sri Pawar, Kriti Garg, Tanikella Bharani are the lead cast. Sri Pawar him self directed, penned for this movie. In this occassion Telugu filmibeat brings exclusive review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X