Don't Miss!
- Sports కోహ్లి.. అసలు ఇదేం బ్యాటింగ్- సునీల్ గవాస్కర్
- News రేవంత్ రెడ్డి సీటుకు భలే డిమాండ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఫోర్జరీ చేసి సొమ్మంత కాజేశారు.. తండ్రే విలన్.. వనిత విజయ్ కుమార్ ఆవేదన
సీనియర్ నటుడు విజయ్ కుమార్ ఫ్యామిలీ ఎప్పుడూ వార్తల్లో వైరల్ అవుతూనే ఉంటుంది. వనితను ఆప్పట్లో ఇంట్లోంచి బయటకు గెంటేయడం, విజయ్ కుమార్‌కు అలాంటి గతే పట్టడం, వనిత పెళ్లిళ్లు వైరల్ అవ్వడం ఇలా ఏదో ఒక విషయంలో వార్తల్లో హైలెట్ అవుతూనే ఉంటారు. వనిత విజయ్ కుమార్ మూడో పెళ్లి ఎంతటి సన్సేషన్ క్రియేట్ చేసిందో.. ఆ పెళ్లి పెటాకులు అవ్వడం కూడా అంతే వైరల్ అయ్యింది.
మరోసారి ప్రేమలో?
మూడు పెళ్లిళ్లు చేసుకొని అవి పెటాకులు అవ్వడమే కాదు.. మరోసారి ప్రేమలోపడ్డాననిచెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. అందుకు సింబాలిక్‌గా చేసిన పోస్ట్‌పై ఓ రేంజ్లో నెగెటివ్ ట్రోల్స్ వచ్చాయి. తాజాగా వనిత ఓ చానెల్‌తో మాట్లాడుతూ తండ్రి, ఫ్యామిలీపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.
కేసు వేసినా..
నాన్న నన్ను కూతురుగా చూడకపోయేవారు. తల్లిని కూడా మోసంతో ఫోర్జరీ చేసి ఆమె కష్టపడి సంపాదించిన సొమ్మంతా ఆయనే కాజేశారు. అమ్మ చనిపోయాక నాకు చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా ఆస్తి మొత్తం మిగితా కుటుంబ సభ్యులకు పంచేశారు. ఈ విషయంపై కోర్టులో కేసు కూడా వేసి చివరకు అన్నీ వదిలేశాను అంటూ వనిత తన బాధను చెప్పుకుంది.
ఎన్నో కష్టాలు..
నన్ను బెదిరించడమే గాక, తమిళనాడులో లేకుండా చేస్తానని నాన్న స్వయంగా వార్నింగ్ ఇచ్చారు. కట్టుబట్టలతో పోలీసుల చేత ఇంటి నుంచి బయటకి గెంటేశారు. ఆ తర్వాత ఇద్దరు పిల్లలతో ఒక సంవత్సరం పాటు ఎన్నో కష్టాలు అనుభవించాను. కర్ణాటకలో ఉంటూ స్నేహితుల సాయంతో చాలారకాల పనులు చేసి మళ్లీ నిలదొక్కుకున్నానని వనిత ఆవేదన చెందింది.
సంతోషంగా జీవిస్తున్నా..
ఇక ఇప్పుడు నా తండ్రిని.. వనితా విజయ్‌కుమార్ తండ్రి అని చెప్పుకోవడం గర్వంగా ఉంది. ఒకవేళ ఈ సమయానికి నా తల్లి బతికి ఉండుంటే ఈ పరిస్థితిని చూసి బాధపడేది నాకు ఏదో ఒక న్యాయం చేసేది. కుటుంబం అంతా ఒక్క పైసా కూడా ఇవ్వకుండా మోసం చేసినా ప్రస్తుతం నాకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొని సంతోషంగా జీవిస్తున్నానని వనిత విజయ్ కుమార్ చెప్పుకొచ్చింది.
అల్లు అర్జున్‌పై కామెంట్స్..
అల్లు అర్జున్ లైన్ వేసేవాడంటూ వనిత చెప్పిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. చెన్నైలో తెలుగు పరిశ్రమ ఉన్న సమయంలో మెగాస్టార్ ఫ్యామిలీతో మాకు చాలా అనుబంధం ఉండేది. చిరంజీవి ఇంట్లో జరిగే బర్త్ డేకు మా ఫ్యామిలీ అంతా వెళ్లే వాళ్లం. చిరంజీవి నటించే ఓ సినిమా ఒపెనింగ్‌కు వెళ్లిన సమయంలో అల్లు అర్జున్ నాకు లైన్ వేశాడంటూ వనిత చెప్పిన మాటలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి.