twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజనీకాంత్ మాస్ హీరో.. తమిళ పాలిటిక్స్‌పై నారాయణమూర్తి సెన్సేషనల్ కామెంట్స్

    By Rajababu
    |

    Recommended Video

    తమిళ్ నాడు రాజకీయాల గురించి ఆర్ నారాయణ మూర్తి విశ్లేషణ

    తమిళనాడు రాజకీయాల్లోకి సినీ దిగ్గజాలు రజనీకాంత్, కమల్ హాసన్ ప్రవేశించడంపై పీపుల్స్‌స్టార్ ఆర్ నారాయణమూర్తి స్పందించారు. దేశంలోని రాజకీయాలతో సంబంధం లేకుండా తమిళనాడు పాలిటిక్స్ చాలా తీవ్రంగా ఉంటాయి. ఒకప్పడు పంజాబ్ నుంచి ఖాలీస్థాన్ విడిపోవడం కంటే ముందుగా తమిళనాడు విడిపోతుందనే ఆందోళన ఉండేది అని ఆర్ నారాయణ మూర్తి అన్నారు. ఇంకా తమిళ పాలిటిక్స్‌పై ఆయన వెల్లడించిన అభిప్రాయాలు ఇవే.

    పాలిటిక్స్‌తో సినిమాలకు

    పాలిటిక్స్‌తో సినిమాలకు

    తమిళ రాజకీయాలకు, సినీ పరిశ్రమకు అవినాభావ సంబంధం ఉంది. గతంలో రాజకీయాలపై ఎనలేని ప్రభావం చూపిన అన్నాదురై, కరుణానిధి సినీ రచయితలు, ఎంజీఆర్ సినీ హీరో, జయలలిత సినీ హీరోయిన్, విజయ్‌కాంత్, నెపోలియన్‌తోపాటు ఎందరో రాజకీయాల్లోకి ప్రవేశించి విజయం సాధించారు.

    జయలలిత ఉక్కు మహిళ

    జయలలిత ఉక్కు మహిళ

    జయలలిత ఉక్కు మహిళ. ఆమె మరణం తర్వాత రాజకీయ సంక్షోభం ఏర్పడింది. అలాంటి పరిస్థితుల్లో రజనీకాంత్, కమల్‌హాసన్ పార్టీలు పెట్టి రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

    మాస్ హీరోలకు ప్రజాదరణ

    మాస్ హీరోలకు ప్రజాదరణ

    రాజకీయాల్లో మాస్ హీరోలకు ప్రజల నుంచి మంచి ఆదరణ ఉంటుంది. ఎంజీఆర్ పార్టీ పెట్టి సక్సెస్ అయ్యారు. శివాజీ గణేషన్ సక్సెస్ కాలేకపోయారు. ఒకప్పుడు ఎంజీఆర్ వర్సెస్ శివాజీ గణేషన్ అనే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితే కనిపిస్తున్నది.

    రజనీకాంత్ మాస్ హీరో

    రజనీకాంత్ మాస్ హీరో

    రజనీకాంత్, కమల్ హాసన్ మధ్య పోటీ ఉంది. కానీ రజనీకాంత్ మాస్ హీరో. అతనివైపు ప్రజలు మొగ్గుచూపే అవకాశం ఉంది. అలా అని కమల్ హాసన్ తక్కువ అంచనా వేయలేం. వారి అజెండాలు, రాజకీయ విధానాలను బట్టి ప్రజలు ఓట్లు వేస్తారు. ఇప్పుడే ఓ నిర్ణయానికి రాకూడదు అని నారాయణమూర్తి అన్నారు.

    English summary
    People star R Narayana Murthy made analysis on Tamilnadu politics. He said that Rajinikanth is mass hero in the film Industry. People may respond to him positively.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X