Just In
- 25 min ago
రామ్ చరణ్‌కు ప్రతిష్టాత్మక అవార్డ్.. ఆ ఫ్యాన్‌కు అంకితమిచ్చి గొప్ప మనసు చాటుకున్నాడు
- 1 hr ago
సెక్స్ అంటే చాలా ఇష్టం.. నాకు నచ్చిన వాళ్లతో తిరుగుతాను: యంగ్ హీరో షాకింగ్ కామెంట్స్
- 2 hrs ago
రామ్ ఖాతాలో అరుదైన రికార్డ్.. సౌత్ ఇండియాలోనే మొదటి హీరోగా ఘనత.. అందులో బన్నీదే టాప్ ప్లేస్
- 2 hrs ago
బాలీవుడ్‌లోకి విజయ్.. లాంచ్ చేయనున్న డైనమిక్ డైరెక్టర్.. కరణ్‌తో చర్చలు సఫలం
Don't Miss!
- Finance
పెరిగిన టారిఫ్‌లు.. మరి ఇప్పుడైనా టెలికాం షేర్లు కొనవచ్చా?
- Sports
టీ20ల్లో వెస్టిండీస్ ప్రమాదకారి.. అయినా మేం ఏ జట్టుకు భయపడం: రోహిత్
- News
పీఎస్ఎల్వీ హాఫ్ సెంచరీ: రిశాట్ ప్రయోగానికి కౌంట్ డౌన్: తిరుమలలో ఇస్రో ఛైర్మన్..!
- Lifestyle
బురదలో రొమాన్స్ : ఈ ఫొటో షూట్ ను చూసి తట్టుకోవడం కష్టం.. దీనిపై నెటిజన్లు ఏమంటున్నారంటే..
- Automobiles
మీ అభిమాన హీరో మోటార్ సైకిల్ ఇప్పుడు ఖరీదైనదిగా మారింది
- Technology
యూఎస్‌లో స్టార్టయిన న్యూ మాక్ ప్రో ఆర్డర్స్
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
ఏడేళ్ల నుంచి ట్రై చేస్తున్నా పడటం లేదు.. సుడిగాలి సుధీర్ సెన్సేషనల్ కామెంట్స్
బుల్లితెరపై ఎన్నో జంటలు వస్తున్నాయ్..పోతున్నాయ్ కానీ సుడిగాలి సుధీర్-రష్మీ మాత్రం అలానే ఎంటర్టైన్ చేస్తూ మిగిలిపోతున్నారు. రవి-లాస్య, రవి-శ్రీముఖిల జంట బుల్లితెరపై ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. తమ టైమింగ్‌తో ప్రేక్షకుడిని ఆకట్టుకుంటూ.. ఫుల్ ఫేమస్ అయ్యారు. ఇలా ఈ జాబితాలో వర్షిణి, విష్ణుప్రియ లాంటి వారు వస్తున్నా.. సుధీర్-రష్మీ మధ్య ఉన్న కెమెస్ట్రీని బీట్ చేయలేకపోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్ అంటే ఇప్పటికీ క్రేజే. వీరిద్దరు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఈవెంట్లను చేస్తూ ఉంటే షోలతో అదరగొట్టేస్తున్నారు.

జబర్దస్త్‌తో ఏర్పడిన బంధం..
బుల్లితెరపై జబర్దస్త్ ఓ సంచనంల అయితే అందులో రష్మీ-సుధీర్ అనే జంట అంతకుమించి అనే సెన్సేషన్. రష్మీని మొదట ఎప్పుడు ఎక్కడ ఎలా చూశాడన్న విషయాన్ని ఎంతో ఫీల్‌గా ఎన్నో వేదికలపై చెప్పుకొచ్చాడు. అయితే అది ఈవెంట్‌లోని స్కిట్లో భాగమే అయినా నిజంగానే ఫీలై చెబుతున్నాడేమోనని సందేహం కలగకమానదు. ఎందుకంటే వారి మధ్య కెమెస్ట్రీ అలాంటింది.

స్కిట్లో రష్మీపై పంచ్‌లు
సుడిగాలి సుధీర్ తన ప్రతీ స్కిట్లో రష్మీని టార్గెట్ చేస్తూ రెండుమూడు పంచ్‌లు వేస్తూ ఉంటాడు. అవి కూడా ప్రేమ, పెళ్లికి సంబంధించిన విషయాలపై రష్మీని టచ్ చేస్తూ ఉంటాడు. అలా ఎన్నో సందర్భాల్లో స్టేజ్‌పైనే రష్మీకి ప్రపోజ్ చేసేశాడు. అలా వారిద్దరి మధ్య కొనసాగుతున్న రహస్య బంధమే వారిని అంతగా హైలెట్ చేస్తోంది.

అంగరంగవైభవంగా పెళ్లి..
నిజమైన పెళ్లితంతను తలపించేలా.. రష్మీ-సుధీర్ పెళ్లిని జరిపించింది జబర్దస్త్. స్కిట్లో భాగంగా అంగరంగవైభవంగా జరిపించిన ఆ పెళ్లిలో వారి రియాక్షన్ చూస్తే.. అది నిజమైన ఘట్టమేనని అనిపించేలా ఉంటుంది. అంతలా స్మాల్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేసేశారు వీరిద్దరు.

ఎన్నో సార్లు ఖండించారు..
తామిద్దరం కేవలం స్నేహితులమేనని ఎన్నోసార్లు చెప్పినా.. వారి చేష్టలు మాత్రం అలా అనిపించేవి కాదు. సోషల్ మీడియాలో అయితే ఏకంగా రష్మీకి సుధీర్‌ను పెళ్లి చేసుకోవచ్చు కదా అనే కామెంట్లు పెట్టేవారు. వీరిద్దరి మధ్య ఉన్న రహస్య బంధానికి సంబంధించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి.

తాజాగా మరోసారి రష్మీని ఉద్దేశించి..
ఈ వారంలో ప్రసారం కానున్న ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమోలో రష్మీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. స్కిట్లో భాగంగా.. ఏడేళ్ల నుంచి ఓ అమ్మాయిని ట్రై చేస్తున్నా.. అంటూ రష్మీపై కొంటెగా చూస్తుండగా.. ఆమె మాత్రం ముసిముసి నవ్వులు నవ్వింది. దీంతో ఈ ప్రోమో కాస్త వైరల్ కాసాగింది.