Don't Miss!
- News
vastu tips: నట్టింట్లో కూర్చుని జుట్టు దువ్వుకుంటున్నారా? అరిష్టం.. ఎందుకంటే!!
- Sports
INDvsNZ : తొలి టీ20లో గిల్ ఆడతాడు.. పృథ్వీ షాకు ఛాన్స్ లేదు: హార్దిక్ పాండ్యా
- Finance
upi limit: UPI తో ఎంత డబ్బు పంపించవచ్చో తెలుసా ? అంతకు మించి పంపాలంటే..
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
ఇండియాను డివైడ్ చేయాలంటే ఆ సినిమా.. ఏకం చేయాలంటే RRR.. కౌంటర్ ఇచ్చిన సీతక్క
నందమూరి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కలిసి నటించిన మొట్ట మొదటి బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ RRR ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. అయితే సినిమా ఊహించినట్లే బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనాలు క్రియేట్ చేస్తోంది. మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద దూకుడు పెంచిన ఈ సినిమా చాలా మంది ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంటోంది. రీసెంట్ గా కాంగ్రెస్ రాజకీయ నాయకురాలు మాజీ నక్సలైట్ సీతక్క కూడా ఎవరూ ఊహించని విధంగా స్పందించారు. అధికార ప్రభుత్వం కూడా ఆమె సెటైర్స్ వేసే విధంగా వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఒకసారి ఆ వివరాల్లోకి వెళితే..

స్ట్రాంగ్ ఓపెనింగ్స్
దర్శక ధీరుడు రాజమౌళి భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ త్రిబుల్ ఆర్ గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి రోజు బాహుబలి సినిమా రికార్డులను బ్రేక్ చేసి అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా గుర్తింపును అందుకుంది. జూనియర్ ఎన్టీఆర్ స్థాయి కూడా ఈ సినిమాతో ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం చాలా మంది ప్రముఖులు ఈ సినిమాను థియేటర్స్ కు వెళ్లి సాదారణ జనాలతో కలిసి వీక్షిస్తున్నారు.

RRR సినిమాను చూసిన సీతక్క
సీనియర్ కంగ్రెస్ నాయకురాలు, మాజీ నక్సలైట్, ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా RRR సినిమాను సాధారణ జనాలతో ప్రత్యేకంగా వీక్షించి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా ఆమె ఇటీవల వివాదాస్పదంగా మారుతున్న ఒక సినిమాపై కూడా ఎవరూ ఊహించని విధంగా స్పందించడం హాట్ టాపిక్ గా మారింది.

ది కాశ్మీర్ ఫైల్స్..
గత కొన్ని వారాలుగా ది కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమా ఏ స్థాయిలో వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది. కాశ్మీర్లో హిందూ పండితుల పై జరిగిన దాడులను ఆధారంగా చేసుకొని తెరకెక్కించిన ఆ సినిమా పై పలువురు ప్రతిపక్ష పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అదే తరహాలో సీతక్క కూడా సోషల్ మీడియా లో తనదైన శైలిలో వివరణ ఇచ్చారు.

ఏకం చేయాలంటే RRR చూడాలి
కలిసి ఉన్న దేశాన్ని విభజించాలి అంటే ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూడాలి అని.. ఇక అందరినీ ఏకం చేయాలి అంటే RRR సినిమాను చూడాలి అని ఎమ్మెల్యే సీతక్క సోషల్ మీడియాలో స్పందించారు. అంతేకాకుండా RRR లాంటి సినిమాకు కూడా దేశవ్యాప్తంగా పన్ను మినహాయింపు కల్పించాలి అని అన్నారు.
Recommended Video


అద్భుతమైన నటన అంటూ..
ఇక ఈ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న చిత్ర యూనిట్ సభ్యులను కూడా ఆమె ప్రత్యేకంగా సోషల్ మీడియాలో అభినందించారు. డైరెక్టర్ రాజమౌళి కి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే సీతక్క మన సోదరులు రామ్ చరణ్ తేజ జూనియర్ ఎన్టీఆర్ కూడా అద్భుతమైన నటనతో ఆశ్చర్యపరిచారు అని ఆమె వివరణ ఇచ్చారు. తప్పకుండా ఇలాంటి సినిమాలతో జనాలలో ఒక మంచి స్ఫూర్తి నింపవచ్చు అని కూడా ఆమె సినిమా చూసిన అనంతరం తెలియజేశారు.