twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Radheshyam: తెలుగులో వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్న రాజమౌళి.. మిగతా భాషల్లో ఆ హీరోలు ఫిక్స్!

    |

    రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. యూవీ క్రియేషన్స్ గోపికృష్ణ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమా గత సంక్రాంతికి విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా దేశవ్యాప్తంగా థియేటర్ల పరిస్థితి సందిగ్ధంలో పడడంతో వాయిదా వేసుకోక తప్పలేదు. ఇక మొత్తానికి పరిస్థితులు ప్రస్తుతం బాగానే ఉండటంతో చాలా వరకు థియేటర్స్ లో ఓపెన్ అయ్యాయి.

    ఇక రాధేశ్యామ్ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సిద్ధమయ్యారు. అయితే సినిమాపై మరింత బజ్ పెరిగే విధంగా అప్ డేట్స్ కూడా ఇస్తున్నారు. ఇక ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంత మంది స్టార్స్ కూడా సిద్ధమైనట్లుగా చెబుతున్నారు. ప్రతి భాషలో లోకల్ స్టార్స్ ను రంగంలోకి దింపుతుండడం విశేషం. ఇటీవల హిందీ విషయంలో క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్ సభ్యులు ఇప్పుడు తెలుగు మలయాళం కన్నడ భాషల్లో కూడా ఎవరు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు అనే విషయంలో అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశారు.

     ప్రేమ యుద్ధం

    ప్రేమ యుద్ధం

    పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సత్యరాజ్ కృష్ణంరాజు వంటి ప్రముఖ నటులు కూడా ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నారు. తప్పకుండా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని దర్శకుడు చాలా బలంగా నమ్ముతున్నాడు. ఇక ఈ సినిమా విధికి ప్రేమకు మధ్యలో కొనసాగే ఒక విభిన్నమైన ప్రేమ యుద్ధం అని ప్రతీ ప్రమోషన్ లో హైలెట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ అలాగే సాంగ్స్ కూడా అభిమానులలో పాజిటివ్ అంచనాలను నెలకొల్పాయి.

     మరోసారి భారీగా..

    మరోసారి భారీగా..

    సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని ఎంతగానో ప్రమోట్ చేసినప్పటికీ సినిమా అనుకోని కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మార్చి 11వ తేదీన ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. అంతేకాకుండా మరొకసారి సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయ్యే విధంగా ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. రెండవ ట్రైలర్ తో పాటు ముంబైలో ఒక భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

    హిందీలో అమితాబ్ బచ్చన్

    రాధేశ్యామ్ సినిమాకు ప్రత్యేకంగా కొంత మంది స్టార్స్ వాయిస్ ఓవర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. హిందీలో ఇదివరకే అమితాబచ్చన్ వాయిస్ ఓవర్ ఇచ్చినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా తెలియజేశారు. మిగతా భాషల్లో ఎవరు నరేషన్ ఇవ్వబోతున్నారు అనే విషయంలో అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. కొద్దిసేపటి క్రితమే యు.వి.క్రియేషన్స్ సోషల్ మీడియా ద్వారా వివరణ అధికారికంగా ఇచ్చింది.

    తెలుగులో రాజమౌళి

    తెలుగులో రాజమౌళి

    తెలుగులో మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇస్తారు అని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే మహేష్ బాబు ఇవ్వడం లేదు అని ముందుగానే దర్శకుడు రాధాకృష్ణ అధికారికంగా తెలియజేశారు. ఇక తెలుగులో దర్శకుడు రాజమౌళి వాయిస్ ఓవర్ ఇచ్చారు అని మరొక టాక్ వినిపించగా ఇప్పుడు అదే నిజమైంది. రాజమౌళి రాధేశ్యామ్ సినిమా కోసం ప్రత్యేకంగా వాయిస్ ఓవర్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ యు.వి.క్రియేషన్స్ ప్రత్యేకంగా పోస్ట్ కూడా చేసింది.

    ఆ భాషల్లో..

    ఆ భాషల్లో..

    ఇక మిగతా భాషల్లో ఎవరు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు అనే విషయంలోకి వెళితే.. కన్నడలో రాధేశ్యామ్ సినిమాకు పునీత్ రాజ్ కుమార్ వాయిస్ ఓవర్ ఇస్తుండగా మలయాళంలో బాష కోసం పృథ్వీరాజ్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారు. ఇక తమిళ్ లో ఎవరు చెబుతున్నారు అనే విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. సత్యరాజ్ సినిమాలో నటిస్తున్నాడు కాబట్టి ఆయనే స్థానిక భాషకు తగ్గట్టుగా వాయిస్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

    English summary
    Ss rajamouli and other stars given voice voice over to prabhas radheshyam
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X