Don't Miss!
- News రాహుల్ సహా నేడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న కీలక నేతలు వీరే..
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నా బాయ్‌ఫ్రెండ్‌ను గోకితే అంతే... పోయేటప్పుడు నా గంట తీసుకెళ్తావా? లిప్‌లాక్‌తో అలియా, రణ్వీర్
టెంపర్ రీమేక్ సింబాతో సంచలన విజయాన్ని సొంతం చేసుకొన్న రణ్వీర్ సింగ్ వరుస విజయాలతో హంగామా సృష్టిస్తున్నారు. ఓ పక్క కలెక్షన్ల హోరు కొనసాగిస్తూనే మరో పక్క ఈ ఏడాదిలో మరో సినిమాను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. రణ్వీర్ సింగ్ నటించిన తాజా చిత్రం గల్లీ బాయ్ చిత్రం ఫిబ్రవరి 14న రిలీజ్ కానున్నది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను బుధవారం రిలీజ్ చేశారు. ట్రైలర్ ఎలా ఉందంటే..
ర్యాపర్‌గా రణ్వీర్ సింగ్
ర్యాపర్‌గా యంగ్ యాంగ్రీ మ్యాన్ పాత్రలో రణ్వీర్ కనిపించాడు. పక్కాగా టపోరి క్యారెక్టర్‌ను పోషించినట్టు స్పష్టమవుతున్నది. స్ట్రీట్ ఫైట్స్, ఫ్యామిలీ డ్రామా, ర్యాపర్‌గా ఒడిదుడుకులు లాంటి అంశాలు ట్రైలర్లో కనిపించాయి. యూత్ ఓరియెంటెడ్ ఎలిమెంట్స్ గల్లీబాయ్ ట్రైలర్లో పుష్కలంగా ఉన్నట్టు స్పష్టమైంది.
2018 పోల్: ఈ హీరోలు, హీరోయిన్ల జాతకాలు మీ చేతుల్లోనే.. ఓట్ వేసి గెలిపించండి!
యాంగ్రీ ఉమెన్‌గా అలియాభట్
ట్రైలర్లో చూపించిన ప్రకారం రణ్వీర్ సింగ్‌కు ఏమాత్రం తగ్గని ఆవేశం ఉన్న పాత్రలో అలియాభట్ నటించినట్టు స్పష్టమైంది. వంటవచ్చా అని అడిగిన ప్రశ్నకు అలియా సమాధానం ఇస్తూ అంతా సవ్యంగా సాగితే ఏదో రోజు నీ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయగలను అని అంటుంది. ఈ చిత్రంలో సఫీనాగా డాక్టర్ పాత్రలో నటించినట్టు స్పష్టమైంది.
నీవు గుండావా? అంటే
"నా బాయ్‌ఫ్రెండ్‌ను గోకితే గట్టిగా ఒక్కటిస్తాను" అని అలియా చెప్పడం.. దానికి రణ్వీర్ "నీవు అంత పెద్ద గుండావా?" ప్రశ్నిస్తాడు. ఓ వ్యక్తిని బాటిల్‌తో తలపై కొట్టి తానేంత పెద్ద గుండానో చేతల్లో చూపిస్తుంది అలియా. ఇద్దరు ఆవేశపరులైన యువ ప్రేమికులుగా రణ్వీర్, అలియా కెమిస్ట్రీ బ్రహ్మండంగా కనిపించింది. నీకు ఏది కావాల్సిస్తే అది చేసుకో అంటూ ఆలియా గట్టి లిప్‌లాక్ సీన్‌తో అదరగొట్టింది.
పేదరికం, భావోద్వేగ అంశాలు
మధ్య తరగతి కుటుంబంలో ఉంటే అవస్థలు, పేదరికం లాంటి భావోద్వేగమైన అంశాలు ఆకట్టుకొనేలా ఉన్నాయి. తండ్రి కొడుకుల మధ్య సంఘర్షణ ఎమోషనల్‌గా ఉంది. నా కంటూ ఓ రోజు వస్తుందంటూ ఆశగా చూసే రణ్వీర్ ట్రైలర్లోనే హంగామా చేశాడు. పుట్టినప్పుడు బట్ట కట్టలేదు.. పోయేటప్పుడు నా గంటా తీసుకెళ్తావా అంటూ ఆవేశంగా ర్యాప్ చేస్తున్న రణ్వీర్ గల్లీ బాయ్ చిత్రంతో యువతలో గిలిగింతలు పెట్టడం ఖాయమనిపిస్తున్నది.
ఫిబ్రవరి 14న విడుదల
అలియాభట్, రణ్వీర్ సింగ్, కల్కీ కోచ్లీన్ నటించిన గల్లీ బాయ్‌కి జోయా అఖ్తర్ దర్శకురాలు. గతంలో దిల్ చాహ్త హై, జిందగీ న మిలేగి దొబారా లాంటి చిత్రాలను తెరకెక్కించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది.