Don't Miss!
- News రేవంత్ రెడ్డి సీటుకు భలే డిమాండ్
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
దిమ్మితిరిగేలా రెబల్ స్టార్ ప్రభాస్ రెమ్యునరేషన్.. ఆ నాలుగు సినిమాలకు వచ్చింది ఎంతంటే?
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ అనగానే దేశవ్యాప్తంగా అందరికి గుర్తొచ్చేది పాన్ ఇండియా అనే. బాహుబలితో నేషనల్ హీరోగా క్రేజ్ అందుకున్నాడు. ఒక విధంగా మార్కెట్ విషయంలో బాలీవుడ్ హీరోల కంటే ప్రభాస్ తక్కువేమి కాదు. క్రేజ్ ప్రస్తుతం ఏ రేంజ్ లో ఉందొ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి సినిమా ఒప్పుకున్నా కూడా మినిమమ్ పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్నాయి. ఇక ప్రభాస్ తో సినిమా చేయాలి అంటే బడ్జెట్ ఈజీగా 250కోట్లు దాటేస్తోంది.
వరుసగా నాలుగు సినిమాలు
ఈ స్టార్ హీరో లైనప్ ఇప్పుడు మామూలుగా లేదు. చేతిలో ఉన్న ప్రతి సినిమా కూడా అభిమానుల్లో అంచనాల డోస్ ను అమాంతంగా పెంచుతోంది. ఒకదానికి మించి మరొకటి అనేలా ఉన్నాయి. ఒక విధంగా ప్రభాస్ ఈ లాక్ డౌన్ ను చాలా బాగా ఉపయోగించుకున్నాడనే చెప్పాలి. దాదాపు నాలుగేళ్ళ వరకు ఖాళీగా ఉండకుండా పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకున్నట్లు చాలా ఈజీగా అర్ధమయ్యింది. ప్రస్తుతం వరుసగా 4 సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే.
రాధేశ్యామ్ సర్ ప్రైజ్..
ప్రభాస్ మొదట రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. జులై 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమాపై అభిమానుల్లో నమ్మకం అయితే చాలానే ఉంది. ఇక అప్డేట్స్ ఇవ్వడంలో చిత్ర యూనిట్ కాస్త స్పీడ్ పెంచింది. మార్చ్ ఫస్ట్ వీక్ లో మొదటి సాంగ్ రానున్నట్లు సమాచారం.
వచ్చే ఏడాది సలార్
ఇక ప్రస్తుతం ప్రభాస్ అభిమానుల ఫోకస్ మొత్తం KGF డైరెక్టర్ సలార్ సినిమాపైనే పడింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్ ఫిక్షన్ సినిమాతో పాటు ఆదిపురుష్ సినిమాను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్ ప్రశాంత్ నీల్ తో కూడా సినిమా చేస్తున్నాడు అనగానే ఒక్కసారిగా అభిమానులు ఎగిరిగంతేశారు. ఇక ఈ సినిమా కూడా వచ్చే ఏడాది రాబోతున్న విషయం తెలిసిందే.
ఒక్క సినిమాకు.. ప్రభాస్ రెమ్యునరేషన్
ప్రభాస్ ఎంత బిజీగా ఉన్నాడో అందరికి ఒక క్లారిటీ వచ్చేసింది. అయితే ప్రభాస్ ఒక సినిమాకు ఇప్పుడు అందుకుంటున్న రెమ్యునరేషన్ ఎంత అనేది హాట్ టాపిక్ గా మారింది. బాహుబలి అనంతరం , సాహో ద్వారా బాలీవుడ్ లో కలెక్షన్స్ గట్టిగానే అందుకున్నాడు. దీంతో ప్రభాస్ రెమ్యునరేషన్ ఇప్పుడు ఒక్క సినిమాకు 100కోట్లు అందుకుంటున్నట్లు టాక్ వస్తోంది.
ఇప్పటివరకు వచ్చిన మొత్తం రెమ్యునరేషన్
రాధే శ్యామ్, సలార్, ఆదిపురుష్ సినిమాలతో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్న సైన్స్ ఫిక్షన్ సినిమా కూడా ఇండియన్ బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమాల నుంచి ప్రభాస్ కు మొత్తం 400కోట్లు అందుతున్నట్లు టాక్ వస్తోంది. ఈ మధ్య కాలంలో ఏ స్టార్ హీరో కూడా ఈ రేంజ్ లో పారితోషికాన్ని అందుకోలేదనే చెప్పాలి. ఇక ఆ పాన్ ఇండియా సినిమాలు ఏ రేంజ్ లో హిట్టవుతాయో చూడాలి.