ఇండియన్ బాక్సాఫీస్‌ను కుమ్మేయడానికి సిద్దమైన సినిమాలివే.. ప్రభాస్, అర్జున్‌ కోసం వెయిటింగ్!

తెలుగులో ప్రస్తుతం చాలా సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. అయితే ఈ అన్ని సినిమాల్లో తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా ఏ సినిమా చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు అంటే అంత ఈజీగా సమాధానం చెప్పలేం. కానీ పాపులర్ సోషల్ మీడియా సర్వే సంస్థ ఆర్మాక్స్ మీడియా ఏ సినిమా మీద తెలుగు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు అనే విషయం మీద ఒక సర్వే చేపట్టింది. ఈ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాల్లోకి వెళితే..

పుష్ప ది రూల్

పుష్ప ది రూల్


అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా ఎంత అద్భుతమైన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. రష్మిక మందన హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని గతంలోనే ప్రకటించారు. మొదటి భాగంలో ఒక ఎర్ర చందనం మొక్కలు కొట్టే కూలి స్మగ్లర్ స్థాయికి ఎలా వెళ్ళాడు అనేది చూపించగా ఆ తర్వాత రెండో భాగంలో స్మగ్లర్ స్థాయి నుంచి గ్యాంగ్ స్టర్ గా మారి ఎలాంటి విధ్వంసం సృష్టించారు అనేది చూపించే అవకాశం ఉందని అంటున్నారు. తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా ఈ సినిమా కోసం విపరీతంగా ఎదురుచూస్తున్నారు.

సలార్

సలార్


ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న రెండో సినిమాగా నిలిచింది. చివరిగా ప్రభాస్ చేసిన రాధేశ్యాం సినిమా డిజాస్టర్ కావడం ప్రశాంత్ నీల్ చివరిగా చేసిన కేజిఎఫ్ 2 సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించడంతో వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనే విషయం మీద ప్రేక్షకులందరికీ విపరీతమైన ఆసక్తి నెలకొంది. హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది.

 లైగర్

లైగర్


పూరి జగన్నాథ్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఎదురుచూస్తున్న సినిమాల జాబితాలో మూడో స్థానం దక్కించుకుంది. రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను పూరి కనెక్ట్స్ బ్యానర్ మీద ఛార్మీ, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఆది పురుష

ఆది పురుష


బాలీవుడ్లో తానాజీ సినిమాని తెరకెక్కించిన ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఈ సినిమా రూపొందుతోంది. కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల జాబితాలో నాలుగో స్థానం దక్కించుకుంది. ఈ సినిమాను టి సిరీస్ సంస్థతో కలిసి మరికొన్ని సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి.

హరిహర వీరమల్లు

హరిహర వీరమల్లు


పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఏఎం రత్నం నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఎదురుచూస్తున్న సినిమాల జాబితాలో 5వ స్థానం దక్కించుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X