twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బహుబలి’ వెనక రామోజీరావు ఫైనాన్షియల్ హ్యాండ్?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'బాహుబలి' చిత్రం భారతీయ సినిమా చరిత్రలోనే రూ. 175 కోట్ల వ్యయంతో తెరకెక్కుతున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త వినిపిస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీ అధినేత రామోజీరావు ఈ చిత్రానికి భారీ మొత్తంలో ఫైన్స్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాహుబలి పార్ట్-1 కోసం రూ. 45 కోట్లు, బాహుబలి పార్ట్-2 కోసం ఆయన రూ. 25 కోట్లు 2% వడ్డీకి ఫైన్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజానిజాలు తేలాల్సి ఉంది.

    రాజమౌళి దర్శకత్వంలో తెరెక్కుతున్న 'బాహుబలి' చిత్రం అటు బడ్జెట్ పరంగా...ఇటు బిజినెస్ పరంగా అసలు అంచనాలకు అందడం లేదు. తెలుగు సినిమా చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌తో ఖర్చు పెట్టి తీస్తున్న ఈచిత్రం....థియేట్రికల్ రైట్స్ విషయంలోనూ సంచలనాలు రేకెత్తిస్తున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

    ఈ చిత్రానికి సంబంధించిన సైడెడ్ రైట్స్ రూ. 13 కోట్లకు, బెంగుళూరు రైట్స్ రూ. 9 కోట్లకు అమ్మడు పోయినట్లు వార్తలు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నైజాం ఏరియా రైట్స్ ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు రూ. 25 కోట్లు పెట్టి సొంతం చేసుకున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. బాహుబలి పార్ట్-1 కోసమే దిల్ రాజు ఈ మొత్తం ఖర్చు పెట్టాడట.

    Ramoji Rao financed for Baahubali

    ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియదు కానీ....ఈ లెక్కలు సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగేందుకు దోహద పడుతున్నాయి. మరి ఇదంతా సినిమాపై హైప్ క్రియేట్ చేసేందుకు రాజమౌళి అండ్ టీం ప్లే చేస్తున్న పబ్లిసిటీ ట్రిక్సా? లేక నిజంగానే ఈ రేంజిలో బిజినెస్ జరుగుతుందా? అనేది తేలాల్సి ఉంది.

    బాహుబలి సినిమాను రెండు పార్టులుగా చిత్రీకరిస్తున్న రాజమౌళి.....రెండు భాగాలకు కలిపి రూ. 175 కోట్ల వరకు ఖర్చు పెట్టిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే ఇండియన్ సినిమా చిరిత్రలో ఇదే అత్యంత భారీ బడ్జెట్ మూవీ.

    ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, హిందీలో పాటు విదేశీ బాషల్లో కూడా విడుదల చేస్తారట. రెండు పార్ట్స్ కాబట్టి పెట్టిన పెట్టబడి గ్యారంటీగా తిరిగి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకైతే రాజమౌళి అంచనాలు తప్పలేదు. ఏది చేసినా ముందు దాని గురించి క్షుణ్ణంగా స్టడీచేసి పర్‌ఫెక్టుగా చేయడం ఆయన స్టైల్. మరి రాజమౌళి ప్రయత్నం సక్సెస్ అయి తెలుగు సినిమా ఖ్యాతి ఖండాంతరాలు దాటాలని ఆశిద్దాం.

    ఈ చిత్రంలో ప్రభాస్, రానా, అనుష్క శెట్టి, తమన్నా లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఇంకా రమ్యకృష్ణ, సత్యరాజ్, నాసర్, అడవి శేష్, సందీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బాహుబలి మొదటి పార్ట్ 2015లో థియేటర్లోకి వస్తుందని అంటున్నారు.

    English summary
    According to the sources, Ramoji Rao financed for Baahubali project. Buzz is Part 1 is financed for Rs 45crs and Part 2 for Rs.25 crs at the rate of 2% interest.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X