For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆరోగ్యాన్ని వడ్డించేస్తున్న అక్కినేని వారి కోడలుపిల్ల

  |

  లాక్ డౌన్ పుణ్యమాని సోషల్ మీడియాలో మస్త్ యాక్టివ్ గా మారిన సమంత అక్కినేని, ఫిట్నెస్ సీక్రెట్టులు, సౌందర్య రహస్యాలతో పాటూ, చాలా ముచ్చట్లనే పంచుకుంటోంది. ముఖ్యంగా, అమ్మడి పోస్టుల్లో ఎప్పుడూ దర్శనమిచ్చే ఆమె పెంపుడు శునకం అయితే, పెద్ద స్టారే అయిపోయింది. ఇక తాజా ముచ్చట ఏమిటంటే, సమంత వంటింటిలో తెగ ప్రయోగాలు చేసేస్తోందట.ఆ ముచ్చటేంటో చూద్దాం.

  సాధారణంగా అయితే క్షణం తీరిక లేకుండా బిజీగా ఉంటే సమంత వంటింటి జోలికి పోవడం అరుదనే చెప్పాలి. పెళ్లయిన కొత్తలో నాగ చైతన్య అమ్మడికి స్వయంగా వండిపెట్టిన సందర్భాలు అనేకం. ఆ విషయం కూడా అమ్మడి ఇన్స్టా పోస్టుల ద్వారానే తెలిసిందనుకోండి. ఇకలాక్ డౌన్ పుణ్యమాని గరిట తెప్పడం మొదలుపెట్టిన సామ్, ఏకంగా ఆరోగ్యాన్నే వడ్డించేస్తోందట.

  Samantha turns out to be an impressive Chef

  ఆరోగ్యాన్ని వడ్డించేస్తోంది అంటే... ఇదెక్కడి విడ్డూరమూ అనుకునేరు. విషయం ఏమిటంటే, అమ్మడు ఏదో పిచ్చాపాటీ వంటకాలతో సరిపెట్టేయకుండా, ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ, న్యూట్రీషియన్ సూచనల మేరకు వంటకాలు చేస్తోందట. ఇందులో భాగంగానే తోఫూ పన్నీర్ తో టామ్ యమ్ సూప్, రైస్ నూడుల్స్ చేసి వహ్వా అనిపించేసుకుంది. ఇక ఇన్స్టాలో పోస్ట్ చేసిన ఈ ఫొటోలకు లైకులు మీద లైకులు పడుతున్నాయి. మరి ఇప్పుడైనా అర్ధమైందా, సమంత ఫిట్నేస్ వెనుక అసలు రహస్యం.

  English summary
  Samnatha Akkineni, who is considered as a fitness freak, turns chef and cooks delicious and healthy food for Hubby Naga chaitanya. Says she's been impressing herself in kitchen these days.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X