సారీ.. క్షమించండి.. ఆ పరిస్థితుల్లో నా పెళ్లి.. హీరోయిన్ ప్రణిత క్లారిటీ

దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ ప్రణిత సుభాష్ వివాహ వార్త సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి రాగానే మీడియాలో హల్‌చల్ రేపింది. శుక్రవారం అంటే మే 28వ తేదీ రోజున పెళ్లి జరిగిందనే విషయం మీడియాలో ప్రచారం జరుగుతున్న సమయంలో అధికారికంగా తన పెళ్లి గురించి ప్రణతి సుభాష్ సోషల్ మీడియాలో స్పందించారు. తన ఇన్స్‌టాగ్రామ్ పోస్టులో..

పెళ్లి గురించి సమాచారం అందించలేకపోయా

పెళ్లి గురించి సమాచారం అందించలేకపోయా

అత్యంత నిరాడంబరంగా నా వివాహం 2021, మే 30 తేదీన జరిగిందని తెలియజేయడానికి చాలా హ్యాపీగా ఫీలవుతున్నాను. నా పెళ్లి గురించి సమాచారం ఎలాంటి సమాచారం అందించలేనందుకు క్షమాపణలు కోరుతున్నాను. నా పెళ్లికి సంబంధించిన డేట్ హడావిడిగా జరిగింది. అందుకే చెప్పలేకపోయాను అంటూ తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలిపారు.

కరోనా కారణంగా సందిగ్దత

కరోనా కారణంగా సందిగ్దత

కోవిడ్ పరిస్థితులు దారుణంగా ఉండటం వల్ల మా పెళ్లి ఏ రోజు జరుగుతుందనే విషయంపై క్లారిటీ లేకపోయింది. పెళ్లి ముందు రోజు వరకు కూడా అలాంటి సందిగ్దత కొనసాగింది. అందుకే ఎక్కువ మందికి చెప్పలేకపోయాం. 50 మందికంటే ఎక్కువ మందికి అనుమతి లేకపోవడం ఆహ్వానించలేకపోయాం అని ప్రణిత సుభాష్ వెల్లడించారు.

పెళ్లి తేదీలపై సందేహాలు

పెళ్లి తేదీలపై సందేహాలు


కరోనావైరస్ కారణంగా చాలా రకాల సమస్యలు ఉండటంతో మా పెళ్లి ముహుర్తం తేదీలపై రకరకాల సందేహాలు నెలకొన్నాయి. ఆ క్రమంలో మేము ఏదీ నిర్ణయించుకోలేక సతమతమయ్యాం. అందుకే వివాహ తేదీపై మాకే తెలియని సందిగ్దత ఉండటంతో హడావిడిగా పెళ్లి జరిగింది అని ప్రణిత సుభాష్ తన ఇన్స్‌టాగ్రామ్ పోస్టులో పేర్కొన్నారు.

మమల్ని మన్నించండి.. దీవించండి..

మమల్ని మన్నించండి.. దీవించండి..


మా పెళ్లి అనేది మాకు స్పెషల్ డే. అలాంటి కార్యక్రమంలో మీరు లేకపోవడం మాకు ఓ రకమైన బాధగా ఉంది. మిమ్మల్ని మా పెళ్లి వేడుకకు ఆహ్వానించకపోవడాన్ని పెద్ద మనసుతో మన్నించమని కోరుతున్నాం. మీ దీవెనలు చాలా ముఖ్యం. పరిస్థితులన్నీ సానుకూలంగా మారిన తర్వాత మళ్లీ కలుద్దాం అని ప్రణిత సుభాష్ నితిన్ పేరిట ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు.

Recommended Video

Bengaluru లో Pranitha Subhash Nitin Raju Marriage | గొప్ప మనసున్న నటి || Filmibeat Telugu
ప్రణిత సుభాష్ కెరీర్ గురించి

ప్రణిత సుభాష్ కెరీర్ గురించి


దక్షిణాదిలో ప్రణిత కెరీర్ విషయానికి వస్తే.. కన్నడలో రిషితో కలిసి రామన అవతార చిత్రంలోను, తెలుగులో సిద్దార్థ్‌తో కలిసి బావ అనే మూవీలో, అలాగే తమిళంలో కార్తీతో కలిసి శకుని చిత్రంలో నటించింది. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి రెండు భారీ సినిమాల్లో నటిస్తున్నారు. హంగామా2, భుజ్ లాంటి చిత్రాల్లో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X