X
తెలుగు » సినిమాలు » భలే భలే మగాడివోయి
భలే భలే మగాడివోయి

భలే భలే మగాడివోయి

Romance | 04 Sep 2015 | U |
Telugu

2.8 /5 Users

2.5 /5 Filmibeat

భలే భలే మగాడివోయి స్టోరీ

భలే భలే మగాడివోయి సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాని, లావణ్య్, మురళి శర్మ, సితారా, వెన్నెల కిశోర్, భద్రమ్, అజై, ప్రవీణ్, సితార, నరేష్, ప్రభు శ్రీను తదితరులు ఇతర ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మారుతి నిర్వహించారు మరియు నిర్మాత బన్ని వాసు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు గోపి సుందర్ స్వరాలు సమకుర్చారు. కథ లక్కి(నాని) కు చిన్నప్పటినుంచీ వీర మతిమరుపు. దాన్నే కంటిన్యూ చేస్తూ పెద్దయ్యాక కూడా మతిమరుపుకు బ్రాండ్ అంబాసిడర్ గా ఎదుగుతాడు. దాంతో అతనికి పెళ్లి సైతం ఓ సమస్యగా మారుతుంది. ఈ నేపధ్యంలో అతనికి ఓ సైంటిష్టు పూర్ణ చంద్రరావు (మురళి శర్మ) కుమార్తెతో ఓ సంభంధం చూస్తారు. అయితే నాని..ఆయన్ను తన మతిమరుపుతో ఇబ్బందిపెడతాడు. దాంతో నానికి తన కూతురుని ఎట్టి పరిస్దితుల్లో ఇచ్చేది లేదని తెగేసి చెప్పేస్తాడు. తర్వాత నాని ఓ రోజు నందిన(లావణ్య త్రిపాఠి)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతనితో ప్రేమలో పడుతుంది. ఈ లవ్ జర్నిలో ..తన మతిమరుపుతో కొన్నిసార్లు నాని ఆమె దగ్గర దొరికిపోయే సమయంలో తన సమయస్పూర్తితో అప్పటికప్పుడు ఏదో ఒకటి చెప్పి బయిటపడుతూంటాడు. అయితే ఇక్కడో ట్విస్ట్...నందిన మరెవరో కాదు తనని ఇష్టపడకుండా రిజెక్టు చేసిన సైంటిస్టు కుమార్తే. ఈ విషయం తెలిసిన నాని ఎలా కవర్ చేసి, ఆమెను దక్కించుకున్నాడు..అలాగే ఈ చిత్రంలో అజయ్ పాత్ర ఏమిటి..నానికి ప్రేమకు ఎలా అడ్డుపడ్డాడు అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
Read More

భలే భలే మగాడివోయి కాస్ట్ & క్రూ

భలే భలే మగాడివోయి సిబ్బంది సమాచారం

దర్శకత్వం మారుతి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం గోపి సుందర్
నిర్మాత బన్ని వాసు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

భలే భలే మగాడివోయి విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
మారుతి చిత్రాల్లో మొదటి నుంచి ఫన్ కు ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ వస్తున్నారు. అలాగే ఆయన టెక్నికల్ వాల్యూస్ కు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారు. అదే ఈ చిత్రంలోనూ కనపడింది. కెమెరా వర్క్ సినిమాని ఓ మెట్టు పైకి తీసుకు వెళ్లింది. అలాగే మారుతి రాసిన డైలాగులకు ధియోటర్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఫన్ కు ఇచ్చిన ప్రయారిటీ ఆయన కథనం రాసుకోవటం లో ఇవ్వలేదు. హీరో నాని కు చిన్నప్పటి నుంచి తనకు మతిమరుపు అనే సమస్య ఉందని తెలిసినప్పుడు అందుకు ఎక్కడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నట్లు కనపడడు. అలాగే అప్పటికప్పుడు తన మతిమరుపుని కప్పి పుచ్చుకునే చేష్టలు చేస్తూంటాడు, దొరికిపోయినప్పుడు తల వంచుకుంటాడు కానీ దాన్ని అధిగమించటానికి ఏ ప్రయత్నం చేయడు. కేవలం తన కథకు కావాల్సినట్లుగానే కామెడీ వచ్చేటట్లుగానే మారుతి వీటిని ఎస్కేప్ చేసారు. ఎంత సినిమాటెక్ లిబర్టీ అనుకుందామనుకున్నా ఇది ఇబ్బందిగానే అనిపిస్తుంది. అంతేకాదు సీన్లు చాలా వరకూ రిపీట్ అవటం మొదలయ్యాయి. హీరోకు మతిమరుపు- దాని వల్ల వచ్చే ఇబ్బందులు అన్నట్లు అదే పాయింట్ మీద సీన్స్ రాసారు కానీ ఆ వచ్చిన సమస్యను ఎలా అధిగమించే ప్రయత్నం చేసాడు అన్నది చూసుకోలేదు. దాంతో మరో స్దాయికి వెళ్ళాల్సిన కాన్సెప్టు, సినిమా తగ్గిపోయినట్లు అనిపిస్తుంది.

భలే భలే మగాడివోయి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.8 /5 Your Rating

భలే భలే మగాడివోయి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+