X
తెలుగు » సినిమాలు » జై సింహా
జై సింహా

జై సింహా

Action | Drama | Family | 12 Jan 2018 |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

జై సింహా స్టోరీ

జై సింహా సినిమా యాక్షన్ డ్రామా ఫ్యామిలి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో బాలకృష్ణ, నయనతార, హరిప్రియ, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, అశుతోస్ రానా, మురళి మోహన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కె ఎస్ కుమార్ వహించారు మరియు నిర్మాత సి కల్యాణ్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం చిరంతన్ భట్ అందించారు.  కథ నరసింహా (బాలక‌‌‌ృష్ణ) వైజాగ్‌లో మెకానిక్. అన్యాయాన్ని, అక్రమాలను సహించడు. నరసింహా, గౌరీ (నయనతార) గాఢంగా ప్రేమించుకొంటారు. పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకొంటాడు. పరిస్థితుల కారణంగా తాను ప్రాణంగా ప్రేమించిన గౌరీ మనసులో ప్రేమకు బదులు ద్వేషాన్ని పెంచాలనుకొంటాడు. అందుకోసం తన వద్ద పనిచేసే మంగ (హరిప్రియ)ను పెళ్లి చేసుకొని గౌరీకి షాకిస్తాడు. తనను మోసగించడాన్ని కారణంతో నరసింహాపై గౌరీ ద్వేషాన్ని పెంచుకొంటుంది. మంగ కవల పిల్లలకు జన్మనిచ్చి కన్నుమూస్తుంది. తన కవల పిల్లల్లో ఒకరిని గౌరీ వద్దకు చేర్చి తాను తమిళనాడులోని కుంభకోణానికి వెళ్లిపోతాడు. తాను ఇష్టంగా ప్రేమించిన గౌరీకి నరసింహా ఎందుకు దూరమయ్యాడు? గౌరీ మనసులో ప్రేమను తుంచి ద్వేషాన్ని ఎందుకు రగిలించాడు? మంగ ఎందుకు చనిపోయింది? కుంభకోణానికి వెళ్లిన నరసింహాం జీవితంలో ఎలాంటి సంఘటనలు చేటుచోసుకొన్నాయి? రౌడీలు (అశుతోష్ రాణా, బాహుబలి ప్రభాకర్)తో నరసింహాకు ఉన్న వైరం ఏమిటి? గౌరీ, నరసింహం మళ్లీ కలుసుకొన్నాడా? అనే ప్రశ్నలకు సమాధానమే జై సింహా చిత్రం
Read More

జై సింహా కాస్ట్ & క్రూ

జై సింహా సిబ్బంది సమాచారం

దర్శకత్వం కె ఎస్ రవికుమార్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం చిరంతన్ భట్
నిర్మాత సి కళ్యాణ్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

జై సింహా విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
నయనతారకు దూరం కావాలన్న ఏకైక కారణంతో బాలకృష్ణ కుంభకోణం వెళ్లే సీన్‌తో సినిమా ప్రారంభమవుతుంది. కుంభకోణంలో ఎన్నో అవమానాలు దిగమింగుతూ.. ఎవరెన్నీ దాడులు చేసినా సాధువులా జీవితాన్ని గడుపుతుంటాడు. తన మనసులో ఉండే బాధను దిగమింగుకుంటూ తన కుమారుడి కోసం జీవితం సాగిస్తుంటాడు. ఓ అనూహ్యమైన సంఘటన వల్ల బాలకృష్ణ ఫ్లాష్‌బ్యాక్ గురించి చెప్పే సీన్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. రెండో భాగంలో నయనతార, బాలకృష్ణ ప్రేమ ఎపిసోడ్స్, మెకానిక్ షాపులో హరిప్రియతో అల్లరి ఎపిసోడ్స్‌తో కథ రొటీన్‌గా సాగిపోతుంది. ఇక నయనతారకు షాకిచ్చి హరిప్రియను పెళ్లి చేసుకోవడం, రౌడీలు అశుతోష్ రాణా, బాహుబలి ప్రభాకర్‌ను హతమార్చడం, ఆ తర్వాత ఓ సెంటిమెంట్ సీన్‌తో సినిమా ముతకగా ముగుస్తుంది. బాలకృష్ణ ఇమేజ్ ఏ మాత్రం తగ్గని కథ జై సింహా. కానీ కథ, కథనం, సన్నివేశాల రూపకల్పనలో దారుణంగా విఫలయ్యారనే వాదన వినిపిస్తున్నది. 80వ దశకంలో ఇంత నాసిరకంగా సినిమా తీసి ఉండరనే మాటలు వినిపించాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో బాలయ్య చేయాల్సిన సినిమా కాదనే మరో మాట వినిపిస్తున్నది. సంక్రాంతి రేసులో ఫ్యాన్స్ కొంత సంతోషం కలిగినా.. సగటు ప్రేక్షకుడికి మాత్రం కొంత నిరాశే అని చెప్పవచ్చు.

జై సింహా సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్
  • Karnataka's worst movie

×
2.5 /5 Your Rating

జై సింహా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+