X
తెలుగు » సినిమాలు » మహానుభావుడు
మహానుభావుడు

మహానుభావుడు

Action | Romance | 29 Sep 2017 | U/A |
Telugu

2.6 /5 Users

3 /5 Filmibeat

మహానుభావుడు స్టోరీ

మహానుభావుడు సినిమా యాక్షన్ రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శర్వానంద్, మెహరీన్, వెన్నెల కిశోర్, నాజర్, జబరస్థ్ వేణు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మారుతి వహించారు మరియ్ నిర్మాతలు ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ కృష్ణ రెడ్డి కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం తమన్ ఎస్ అందించారు. కథ ఆనంద్ (శర్వానంద్) అతిశుభ్రం, నీట్‌‌గా ఉండటం (ఓసీడీ) అనే ఓ వ్యాధితో బాధపడుతుంటాడు. ధూళి, చెత్త అంటే అసహ్యం. ప్రతీ విషయంలోనూ సానిటైషన్, లోషన్ వాడటం అలవాటు. అలాంటి విపరీతమైన శర్వానంద్ ఓ స్టాఫ్ట్ వేర్ ఇంజినీర్. తన ఆఫీస్‌లోనే పనిచేసే మేఘన (మెహ్రీన్ పిర్దాదా)తో ఆనంద్ ప్రేమలో పడుతారు. మేఘన తండ్రి (నాజర్) కూడా ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. కానీ ఓ కారణం వలన ఆనంద్ ప్రేమను మేఘన తిరస్కరిస్తుంది. తండ్రి (నాజర్) ఆరోగ్యం చూసుకోవడానికి తన ఊరికి వెళ్తుంది. ప్రేమ తిరస్కారానికి గురైన ఆనంద్.. ఆమెను మెప్పించడానికి మేఘన గ్రామానికి వెళ్తారు. అక్కడ ఎందరైన సంఘటనతో సవాల్‌ను ఎదుర్కోవాల్సి వస్తుంది. మేఘనను ఎలా ఒప్పించి ప్రేమను గెలుచుకొన్నాడు. తనకు ఎదురైన సవాల్‌ను ఎలా ఎదుర్కొన్నాడు? తనను పట్టి పీడిస్తున్న వ్యాధి నుంచి బయటపడ్డాడా? ఒకవేళ ఆ వ్యాధి నుంచి బయటపడితే అందుకు బలమైన కారణం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే మహానుభావుడు సినిమా.
Read More

మహానుభావుడు కాస్ట్ & క్రూ

మహానుభావుడు సిబ్బంది సమాచారం

దర్శకత్వం మారుతి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం తమన్ యస్
నిర్మాత ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ కృష్ణా రెడ్డి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

మహానుభావుడు విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
మతి మరుపు కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల చేత భలే భలే అనిపించుకొన్న మారుతి.. తాజాగా ఓ ప్రేమ కథకు ఓసీడీ వ్యాధిని నేపథ్యంగా స్టోరీని అల్లుకొన్నాడు. తొలిభాగంలో ప్రేమకథను చెబుతూనే మరో పక్క ఆహ్లాదకరమైన సన్నివేశాలను చక్కగా డిజైన్ చేసుకొన్నాడు. శుభ్రం అనే పాయింట్ అతిగా మారుతుందని ప్రేక్షకులు గ్రహిస్తున్న సమయంలో ఇంటర్వెల్‌కు ముందు ఎమోషన్ ట్విస్ట్‌తో కథను దర్శకుడు మారుతి మరో మలుపు తిప్పాడు. సెకండాఫ్‌లో గ్రామీణ వాతావరణంలో కథను చక చకా పరుగులు పెట్టించారు. రెండో భాగంలో చెరువు సీన్లు, పచ్చడి అన్నం ఎపిసోడ్ సినిమాకు బలంగా మారాయి. క్లైమాక్స్‌లో రొటీన్ వ్యవహారమే ఉన్నా చివర్లో అమ్మ ప్రేమ పాయింట్‌తో ఫినిషింగ్ టచ్ ఇచ్చి ప్రేక్షకుల్లో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్‌ను కల్పించడంలో సఫలమయ్యాడు.

మహానుభావుడు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

మహానుభావుడు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+