Don't Miss!
- News కర్ణాటకలో నేడు పోలింగ్ జరిగే లోక్‌సభ నియోజకవర్గాలు ఇవే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ముంబై ధారావీ బ్యాచ్‌కి రజినీ సినిమా అవకాశం
ముంబై ధారావీ లో ఉండే ఒక లోకల్ ర్యాప్ గ్రూప్ కి సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘కాలా’లో ఛాన్స్ దక్కింది. చిత్రదర్శకుడు పా. రంజిత్ వీళ్లను హిప్ హాప్ గ్రూప్‌గా సినిమాలో చూపించనున్నారు.
Recommended Video
ధారావీ...! ముంబైలో ఉండే ఈ ఏరియాపేరు దాదాపు భారత దేశం మొత్తం తెలుసు. పాత డిటెక్టివ్ నవలల్లో వర్ణించే స్లం వాతావరణానికి దగ్గరగా ఉండే ఏరియా అది. చాలా రఫ్ పర్సనాలిటీలు ఉంటాయి.., నేరస్తుల శాతం కూడా ఎక్కువే అనే ఒక అపప్రద ఉంది కానీ అది కేవలం నేరస్తుల అడ్డా మాత్రమే కాదు చాలా రకాల ప్రజలు అక్కడ జీవిస్తుంటారు.
పాత నేరస్తుల అడ్డా అన్న మార్క్
దిగువ మధ్య తరగతి జీవితాలు అక్కడ కనిపిస్తాయ్... అల్లరి గ్యాంగులు కొన్ని సంవత్సరాల కిందటి వరకూ కనిపించేవి గానీ ఇప్పుడు ఆపరిస్థితి లేదు అక్కడా ఇంకా అదే పాత నేరస్తుల అడ్డా అన్న మార్క్ తో ఉండి పోయిన ధారావీ లో చాలానే విషయాలున్నాయ్... ముఖ్యంగా ఓ ర్యాప్ గ్రూప్ చాలా ఫేమస్.
చాలామంది అభిమానులు ఉన్నారు
ఆ గ్రూప్‌లో ఉన్నది నలుగురే. టీవీ షోస్, స్ట్రీట్ షోస్‌లో ఈ ర్యాప్ గ్రూప్ చేసే సందడికి చాలామంది అభిమానులు ఉన్నారు. ఇంగ్లిష్, హిందీ, తమిళ, మరాఠీ, మలయాళం భాషల్లో ఈ గ్రూప్ సాంగ్స్ తయారు చేసి, పాడుతుంటారు. ఈ ర్యాప్ గ్రూప్‌కి ఓ జాక్‌పాట్ తగిలింది.
‘కాలా'లో ఛాన్స్
ఏకంగా సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘కాలా'లో ఛాన్స్ దక్కింది. చిత్రదర్శకుడు పా. రంజిత్ వీళ్లను హిప్ హాప్ గ్రూప్‌గా సినిమాలో చూపించనున్నారు. ఈ సన్నివేశాల్లో వచ్చే పాటకు ఈ ర్యాప్ గ్రూప్ ట్యూన్ కూడా రెడీ చేసింది. అంతా ఓ కలలా అనిపిస్తోన్న ఈ గ్రూప్‌కి రజనీకాంత్‌ని కలవడం ఓ స్వీట్ షాక్‌లా అనిపించిందట.
టోనీ సెబాస్టియన్
షూటింగ్ స్పాట్లో రజనీ సార్‌ని కలసినప్పుడు నోట మాట రాకుండా ఆయన్ను చూస్తూ ఉండిపోయామని ర్యాప్ గ్రూప్‌లో ఒకరైన టోనీ సెబాస్టియన్ చెప్పాడు. సూపర్‌స్టార్ రజనీ సార్ సినిమాలో ఛాన్స్ రావడం మాకు ఆనందంగా ఉందన్నారు. అప్పటివరకూ ఒక నార్మల్ ర్యాప్ గ్రూప్‌గానే ఉన్న తమకి ఇలా రజినీ సినిమాలో చాన్స్ రావడం మీద చాలా అనందం వ్యక్తం చేసారు..