Don't Miss!
- Automobiles విమానంలో ప్రేమ కావ్యం.. అద్భుతమైన సన్నివేశానికి ఫిదా అవుతున్న నెటిజన్లు
- Finance Uday Kotak: కోటక్ బ్యాంక్ స్టాక్ క్రాష్.. పాపం ఉదయ్ కోటక్.. ఎంత నష్టపోయారంటే..
- Sports కోహ్లి.. అసలు ఇదేం బ్యాటింగ్- సునీల్ గవాస్కర్
- News రేవంత్ రెడ్డి సీటుకు భలే డిమాండ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఎంగేజ్ మెంట్ చేసుకున్న అర్చన.. వరుడు ఎవరంటే..?
ఒకప్పటి హాట్ హీరోయిన్ అర్చన.. పెళ్లి చేసుకోబోతోంది. దాంతో ప్రస్తుతం సినీ జీవితానికి టాలీవుడ్ నటి అర్చన ముగింపు పలికేందుకు సిద్దమైంది. వ్యాపారవేత్త అయిన జగదీష్ అనే వ్యక్తిని పెళ్లాడేందుకు సిద్దమైంది. నేడు వీరిద్దరి హైదరాబాద్ లో నిశ్చితార్థం జరిగింది. గత కొద్దికాలంగా ప్రేమలో ఉందనే వార్తలకు ఈ నిశ్చితార్థంతో తెర దించింది. ఎంతో వైభవంగా జరిగిన అర్చన నిశ్చితార్థ వేడుకకు సీనీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో బిగ్ బాస్ హౌస్ మిత్రులు ప్రత్యక్షమయ్యారు.
జంటగా హాజరైన శివబాలాజీ
అత్యంత సన్నిహితులు, స్నేహితులు మధ్య ప్రైవేట్‌గా జరిగిన అర్చన నిశ్చితార్థ వేడుకకు బిగ్ బాస్ మొదటి సీజన్ విన్నర్ శివబాలాజీ హాజరయ్యారు. ఆయన తన సతీమణి మధుమితతో కలిసి ఈ ఈవెంట్ కు విచ్చేశాడు.
అభినందనలు నవదీప్, సుమంత్
టాలీవుడ్ యంగ్ యాక్టర్, అక్కినేని హీరో సుమంత్ ఈ వేడుకకు హాజరై.. అర్చనకు అభినందనలు తెలిపారు. అనంతరం ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఆశీర్వదించిన అర్చన తల్లిదండ్రులు
అర్చన తల్లిదండ్రులైన విజయ శాస్త్రి, సుధాకర్ శాస్త్రి.. జగదీష్ తల్లిదండ్రులు ప్రతిభ, భక్తవత్సలం కాబోయే దంపతులను ఆశీర్వదించారు. ఇక పలువురు ప్రముఖలు, బంధువులు ఈ వేడుకకు హాజరై అర్చన, జగదీష్ లకు శుభాకాంక్షలు తెలిపారు.
కుర్రకారు హీటెక్కించిన భామ
తన అందంతో కుర్రకారు హీటెక్కించిన ఈ భామ ప్రస్తుతం సినిమాలకు దూరంగానే ఉంటుంది. బిగ్ బాస్ మొదటి సీజన్లో పాల్గొని వార్తల్లో నిల్చింది. అయితే బిగ్ బాస్ షో తెచ్చిన ఫేమ్ ఆమె సినీ జీవితానికి అంతగా ఉపయోగపడలేదు. తాజాగా సప్తగిరి హీరోగా నటించిన వజ్రకవచధార గోవిందా అనే చిత్రంలో ఓ పవర్ఫుల్ పాత్రను పోషించింది.