అప్పుడే హీరోయిన్‌లా మారిపోయిన అల్లు అర్జున్ కూతురు..స్టైల్‌లో తండ్రికి పోటీగా..
టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్స్ లిస్ట్ తీస్తే అందులో అల్లు అర్జున్ - స్నేహ రెడ్డి కూడా ఉంటారు. కరెక్ట్ వయసులో ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఈ జంట ఎక్కువగా సింపుల్ లైఫ్ ను గడపడానికి ఇష్టపడుతుంది. ఇక ఎప్పటికప్పుడు బన్నీ పిల్లల ఫొటోలు వైరల్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా అల్లు అర్హ తండ్రి కంటే హై రేంజ్ లో ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది. ఇటీవల ఆమె ఇచ్చిన ఒక స్టిల్ అందరిని ఆశ్చర్యపరిచింది.

ఎంత బిజీగా ఉన్నా
అల్లు అర్జున్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా పిల్లలను చూడకుండా రెండు రోజులు కూడా ఉండలేడు. వీలైనంత వరకు వాళ్ళతో ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడతాడు. సెలవుల్లో వేరే ఏ పని కూడా పెట్టుకోకుండా కేవలం పిల్లల కోసమే సమయాన్ని కేటాయిస్తాడు.

కూతురు ఏది చెబితే అది వినాల్సిందే..
కొడుకు అల్లు అయాన్ తో అప్పుడప్పుడు బొమ్మరిల్లు ఫాదర్ లా ఉన్నప్పటికీ కుతురు అల్లు అర్హ దగ్గర మాత్రం బన్నీ ఒక పసి పిల్లడిలా మాటిపోతూ ఉంటాడు. కూతురు ఏది చెబితే అది వినాల్సిందే. తండ్రి కోసం ప్రేమగా వంట కూడా చేస్తుందని బన్నీ ఇటీవల పోస్ట్ చేసిన ఫొటోలతో అర్ధమయ్యింది. దోశ వేసిన ఫొటో ఎంతగా వైరల్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

కెమెరాకు అలవాటు పడుతూ..
ఇక 5 ఏళ్ల వయసులోకి అడుగు పెట్టబోతున్న అల్లు అర్హ ఈ వయసులోనే కెమెరాకు బాగా అలవాటు పడిపోయింది. గత పుట్టినరోజు సందర్భంగా అంజలి అంజలి పాటలో అర్హ చూపించిన హావభావాలు ఎంతో క్యూట్ గా అనిపించాయి. ఆ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.

హీరోయిన్ లాంటి స్టిల్..
ఇక ఇప్పుడు ఏకంగా హీరోయిన్స్ రేంజ్ లో అర్హ స్టిల్ ఇచ్చింది. ఈ వయసులో కెమెరాకు ఇంత క్యూట్ గా స్టిల్ ఇచ్చిన విధానం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. గ్లామరస్ డ్రెస్ లో అర్హ చిన్ని హీరోయిన్ లా ఉందని నెటిజన్లు పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. స్టైల్ లో తండ్రికే పోటీ ఇచ్చేలా ఉందని కూడా అంటున్నారు.


Click it and Unblock the Notifications











