For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'ఎవడు' ఆడియో రివ్యూ (ఫోటో ఫీచర్)

  By Srikanya
  |

  హైదరాబాద్ : రామ్‌చరణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం 'ఎవడు' . శ్రుతిహాసన్‌, అమీజాక్సన్‌ హీరోయిన్స్. అల్లు అర్జున్‌ అతిథి పాత్ర పోషించారు. వంశీ పైడిపల్లి దర్శకుడు. దిల్‌ రాజు నిర్మాత. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు. సోమవారం రాత్రి హైదరాబాద్‌లో 'ఎవడు' ఆడియో వేడుకని నిర్వహించారు. తొలి సీడీని చిరంజీవి ఆవిష్కరించారు. అల్లు అర్జున్‌ చేతుల మీదుగా ప్రచార చిత్రాలు విడుదలయ్యాయి. ఈ ఆడియో పై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి...వాటిని రీచ్ అయ్యిందని విన్న వారు అంటున్నారు.

  ఈ ఆడియో గురించి చిరంజీవి మాట్లాడుతూ....దేవిశ్రీప్రసాద్‌ సంగీతం... ఆ పాటల్లోని కిక్‌ నా చేతా డ్యాన్స్‌ చేయించింది. ఇంట్లో విన్నాను.. నా మనవరాలితో కలిసి డ్యాన్స్‌ చేశాను అన్నారు. అలా చిరంజీవి ఈ ఆడియోపై ఎక్సపెక్టేషన్స్ మరీ పెంచేసారు.

  అందులోనూ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన చిత్రాలన్నీ ఆడియో పరంగా సూపర్ హిట్టవుతున్నాయి. ముఖ్యంగా రీసెంట్ గా అల్లు అర్జున్ కి ఇచ్చిన ఇద్దరమ్మాయిలతో ఆడియో ...సినిమా ఓకే అనిపించుకున్నా...ఆడియో అదరకొట్టిందని అందరి ప్రశంసలు అందుకుంది. మెగా ఫ్యామిలీకి సూపర్ హిట్ మ్యూజిక్ ఇస్తూ వస్తున్న దేవి ఈ సారి ఎలాంటి సంగీతం అందించాడో... స్లైడ్ షోలో రివ్యూ చేసి చూద్దాం.

  స్లైడ్ షోలో ...ఆడియో రివ్యూ...

  సాంగ్ 1 : ఫ్రీడమ్

  గాయకుడు : సుచిత్ సురేసన్

  సాహిత్యం : కృష్ణ చైతన్య

  ఇది సోలో సాంగ్.. చరణ్ ఎంట్రీకి ఇచ్చిన పాట ఇది..చాలా ఫాస్ట్ బీట్ తో డిఫెరెంట్ గా డిజైన్ చేసాడు దేవి. అందులోనూ యువతకు ప్రేరణ ఇచ్చేలా పాటను ప్రత్యేకంగా రాయించటంతో ఈ పాట డీసెంట్ హిట్ గా ఈ ఆల్బమ్ లో నిలుస్తోంది.

  పాట : నీ జతగా

  గాయనీ గాయకులు : కార్తీక్, శ్రేయా ఘోషల్

  సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి

  మెలోడితో సాగే ఈ డ్యూయిట్..ఓ రొమాంటిక్ సాంగ్. సీతారామశాస్త్రిగారు ఈ సాంగ్ కి తన సాహిత్యంతో ఓ రేంజ్ తీసుకువచ్చారు. గిటార్ సౌండ్స్ తో మొదలయ్యే ఈ పాట... ఈ ఆల్బమ్ లో బాగా పాపులర్ అవుతుంది.

  పాట : అయ్యో పాపం

  గాయనీ గాయకులు : రంజిత్, మమత శర్మ

  సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి

  దేవి అంటే ఐటం సాంగ్ లకు ప్రసిద్ది. గబ్బర్ సింగ్ లో కెవ్వు కేక పాటలాగ ...టాప్ లేచిపోద్ది రేంజిలో ఈ పాట దుమ్మురేపేలా ఉంది. ఖచ్చితంగా విజిల్ వేయాలనిపించే పాట ఇది.

  పాట : చెలియా

  గాయకుడు : కె.కె

  సాహిత్యం : చంద్రబోస్

  ఇదో ప్రయోగాత్మకమైన పాట లాంటి పాట అని చెప్పుకోవాలి. పెయిన్ ని ఈ పాటలో చూపించాడు. ఈ ఆల్బమ్ లో ఇదే నెంబర్ వన్ పాట అని ఫిక్సవ్వవచ్చు.

  పాట : ఓయే ఓయే

  గాయనీ గాయకులు : డేవిడ్ సిమోన్, ఆండ్రియా

  సాహిత్యం : శ్రీ మని

  సంగీత ప్రియులను మత్తుగా చిత్తు చేసాలా ఈ పాటను దేవి డిజైన్ చేసారు. అయితే అంతకుముందు విన్న పాటలతో పోలిస్తే పెద్దగా కిక్ ఇవ్వదు. కానీ స్క్రీన్ పై రామ్ చరణ్ అదరకొట్టేలా మాత్రం ఉంది.

  పాట : పింపుల్ డింపుల్

  గాయనీ గాయకులు : సాగర్, రనిన రెడ్డి

  సాహిత్యం : రామ్ జోగయ్య శాస్త్రి

  యూత్ ని ప్రత్యేకంగా టార్గెట్ చేసిన ఈ పాట...మంచి సాహిత్యంతో కలిసి కేక పెట్టించింది. ముఖ్యంగా మాస్ జనాలకు ఈ పాట బాగా పడుతుంది.

  ఈ చిత్రం పూర్తి స్ధాయి యాక్షన్ తో ఎంటర్టైన్మెంట్ అండర్ కరంట్ గా సాగే చిత్రం అని చెప్తున్నారు. ఒకరి ఫీలింగ్స్‌ని మరొకరు షేర్ చేసుకుంటే? ఒకరి బాధల్ని మరొకరు బాధ్యతగా స్వీకరిస్తే? వింటానికి సింపుల్‌గా ఉన్న ఈ ప్రశ్నల వెనుక ఓ దావానలమే దాగి ఉంది. దాని ఆంతర్యమే ‘ఎవడు'. ఇద్దరు వ్యక్తుల మధ్య సంఘర్షణే ఈ సినిమా. ఆ వ్యక్తులు ఎవరు? వారు పడ్డ సంఘర్షణలేంటి? ‘ఎవడు' చిత్రం నేపథ్యం ఇదే.

  రామ్‌చరణ్ భిన్నమైన పాత్రలో యాంగ్రీ యంగ్‌మేన్‌గా ఈ చిత్రం లో కనిపిస్తారు.

  రామ్‌చరణ్‌ మాట్లాడుతూ... ''నాలుగు సన్నివేశాల తరవాత ఓ పాట, వెంటనే పోరాట సన్నివేశం.. ఈ తరహాలో సాగే చిత్రం కాదిది. సినిమా ఎత్తుగడే కొత్తగా అనిపిస్తుంది. పోరాట ఘట్టాలు కూడా విభిన్నంగా తీర్చిదిద్దారు. బన్నీ కనిపించేది కొద్దిసేపే అయినా.. ఆ పాత్రే కథను మలుపు తిప్పుతుంది'' అన్నారు.

  ఈ చిత్రంలో జయసుధ, సాయికుమార్‌, కోట శ్రీనివాసరావు, రాహుల్‌దేవ్‌, అజయ్‌, ఎల్బీ శ్రీరామ్‌ తదితరులు నటిస్తున్నారు. సహ నిర్మాతలు: శిరీష్‌, లక్ష్మణ్‌, కళ: ఆనంద్‌సాయి, కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, ఛాయాగ్రహణం: సి.రామ్‌ప్రసాద్‌.

  సినిమాలో పాటలు అన్నీ బాగున్నాయి. ఏ పాటకాపాట సినిమాని ఊపే రేంజిలో దేవి చేత చేయించాడు..దర్శసుడు వంశీ పైడిపల్లి. తెరపై రామ్ చరణ్ తన స్టెప్ప్ లతో ఇరగ తీస్తాడనే ఆసక్తిని ఈ ఆల్బమ్ రేపుతోంది. ఫైనల్ గా ఇదో ఎంటర్టైన్మెంట్ దేవి మార్క్ ఆల్బమ్.

  English summary
  Ram Charan is gearing up to hit the screens with ‘Yevadu’. The movie is expected to be an action thriller and Vamshi Paidipally is the director. Shruti Haasan and Amy Jackson will be seen as the female leads. The audio album of the film was launched at a star studded ceremony and Devi Sri scored the music. Let us check out the audio album now.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X