»   » బాహుబలి-2లో విచిత్రమైన ఆయుధాలు (న్యూ వర్కింగ్ ఫోటోస్)

బాహుబలి-2లో విచిత్రమైన ఆయుధాలు (న్యూ వర్కింగ్ ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'బాహుబలి' సినిమాలో వేసినన్ని సెట్టింగులు, వాడినన్ని ఆయుధాలు ఇప్పటి వరకు ఏ ఇండియన్ మూవీలో కూడా వాడి ఉండరు. బాహుబలి మూవీ ఇంత పెద్ద హిట్ కావడానికి కారణం సినిమాలో రాజమౌళి ఎన్నో వింతలు, విచిత్రాలు చూపించడం కూడా ఓ కారణమే.

ముఖ్యంగా బాహుబలి పార్ట్-1లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న అంశం సినిమాలో చూపించిన భారీ జలపాతాలు, కోట సెట్టింగులు, యుద్ధంలో వాడిన ఆయుధాలు... బలమైన క్యారెక్టరైజేషన్. ఇక పార్ట్ 2లో అంతకు మించిన అనుభూతిని కలిగించేందుకు రాజమౌళి సిద్ధమవుతున్నారు.


ఏప్రిల్ 28న సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్లో భాగంగా బాహుబలి-2 కు సంబంధించిన కొన్ని వర్కింగ్ స్టిల్స్ రిలీజ్ చేసారు.


విచిత్రమైన ఆయుధాలు

విచిత్రమైన ఆయుధాలు

బాహుబలి-2 లో చిత్ర విచిత్రమైన ఆయుధాలు.... ప్రేక్షకులకు వినోదాన్ని పంచే వింతలు చూపించబోతున్నారు. ముఖ్యంగా గ్రాఫిక్ మాయాజాలం ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేయబోతోంది.


ఐమాక్స్ స్క్రీన్లలో చూస్తే ఆ అనుభూతే వేరు

ఐమాక్స్ స్క్రీన్లలో చూస్తే ఆ అనుభూతే వేరు

బాహుబలి 2 మూవీని ఐమాక్స్ స్క్రీన్లలో చూస్తేనే సరికొత్త అనుభూతి కలుగుతుందని..... అందుకే సినిమాను ఐమాక్స్ ఫార్మాట్ కు కూడా తగిన విధంగా షూట్ చేసి విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.


వేలకొద్దీ థియేటర్లు

వేలకొద్దీ థియేటర్లు

ఇంత పెద్ద సినిమా, ఇండియా మొత్తం ఎదురు చూస్తున్న సినిమా కావడంతో.... రిలీజ్ కూడా భారీ స్థాయిలో చేస్తున్నారు. ఒక్క ఇండియాలోనే 6500 స్క్రీన్లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇతర దేశాల్లో కూడా ఈ సినిమా రికార్డు స్థాయిలో ఎక్కువ స్క్రీన్లలో రిలీజ్ చేయబోతున్నారు.


1000 కోట్లు టార్గెట్

1000 కోట్లు టార్గెట్

ఇండియాలో ఇప్పటి వరకు ఏ సినిమా కూడా రూ. 1000 కోట్ల మార్కును అందుకోలేదు. ఈ మార్కును అందుకోబోయే తొలిసినిమా ఇదే అని అంటున్నారు. అదే జరిగితే ఇండియన్ సినిమా చరిత్రలో బాహుబలి చిరస్థాయిగా నిలిచిపోనుంది.


మేం చేసిన తప్పేంటి? ‘బాహుబలి-2'ను అడ్డుకోవడం దారుణం: రాజమౌళి

మేం చేసిన తప్పేంటి? ‘బాహుబలి-2'ను అడ్డుకోవడం దారుణం: రాజమౌళి

బాహుబలి 2 రిలీజ్ అవుతున్న వేళ కొన్ని అనుకోని ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. కర్నాటకలో ఈ సినిమాను రిలీజ్ కానివ్వబోమంటూ కన్నడ సంఘాలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై రాజమౌళి స్పందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


రాజమౌళి అప్పట్లో లూజు....నేనే మార్చాను, రమా ఇంకా ఏం చెప్పారంటే!

రాజమౌళి అప్పట్లో లూజు....నేనే మార్చాను, రమా ఇంకా ఏం చెప్పారంటే!

బాహుబలి 2 మూవీ రిలీజ్ దగ్గరపడుతున్న వేళ యూనిట్ అంతా ప్రమోషన్లలో బిజీ అయిపోయారు. ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసిన రమా రాజమౌళి మీడియాతో సినిమా గురించి ముచ్చటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


బాహుబలి ఎఫెక్ట్: ప్రభాస్ మీద కన్నేసిన ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్' మేకర్స్

బాహుబలి ఎఫెక్ట్: ప్రభాస్ మీద కన్నేసిన ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్' మేకర్స్

బాహుబలి ప్రాజెక్టు కోసం తన నాలుగేళ్ల కెరీర్ ను పనంగా పెట్టి... సమయం మొత్తం కేవలం ఈ సినిమా కోసమే కేటాయించిన ప్రభాస్ అందుకు తగిన ప్రతిఫలమే అందుకుంటున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


సొంత కొడుకు కాదు.... రాజమౌళి గురించి బయటి ప్రపంచానికి తెలియని విషయాలు!

సొంత కొడుకు కాదు.... రాజమౌళి గురించి బయటి ప్రపంచానికి తెలియని విషయాలు!

బాహుబలి సినిమా కోసం రాజమౌళి ఫ్యామిలీ మొత్తం కలిసి పని చేస్తోంది. ఆయన కుమారుడు కార్తికేయ కూడా ఈ సినిమాకు పని చేసారు. అయితే తాజాగా ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. కార్తికేయ రాజమౌళి సొంత కొడుకు కాదట. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


English summary
Baahubali 2 new working stills released. Check out the photos. Baahubali 2: The Conclusion is an upcoming Indian epic historical fiction film directed by S. S. Rajamouli. It is the continuation of Baahubali: The Beginning. Initially, both parts were jointly produced on a budget of ₹2.5 billion (US$37 million).
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu