Don't Miss!
- Sports SRH vs RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హీరో టార్చర్ తట్టుకోలేకే..
తర్వాత 'రామ్‌దేవ్' చిత్రం షూటింగ్లో ఆయన ఉన్నప్పుడు వెళ్లి అడిగితే రానని చెప్పేశారు. పైగా 'నాకు మానవత్వం లేదే.. డబ్బే ముఖ్యం' అని కూడా అన్నారు. మా దర్శకుడు అరుణ్ కుమార్‌ని అనరాని మాటలు అన్నారు. ఇలా అబ్బాస్ వల్ల మేం పడిన ఇబ్బందులు ఎన్నో. సెట్లో సాంగ్ చిత్రీకరించడం కోసం అన్ని సిద్ధం చేసుకుని ఉంటే నెల రోజుల పాటు షూటింగ్‌కి రాకుండా ఏవో కారణాలు చెప్పి గైరు హాజరయి, మమ్మల్నెంతో ఇబ్బంది పెట్టారు. ఇక మా హీరోయిన్ అర్చన కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టింది. తెలుగు హీరోయిన్ కదా అని మేం తీసుకుంటే మాకు చుక్కలు చూపించింది.
ఇక షూటింగ్ సమయంలోనే కాదు విడుదలకు ముందు కూడా ప్రమోషన్ విషయంలో ఏ మాత్రం సహకరించలేదు. రెండు నెలల పాటు ఆమె ఇంటి చుట్టూ తిరిగిన తర్వాత మా మీద కొంచెం కనికరం చూపించి సినిమా చూసిన తర్వాతే ప్రమోషన్ వర్క్‌లో పాల్గొంటానని చెప్పడంతో ఆమె కోసం ప్రత్యేకంగా షో వేశాం. దానికి ఆమె రాలేదు. వాళ్ల అమ్మగారిని పంపింది... అది కూడా మేం ఎన్నో సార్లు ఫోన్ చేసిన తర్వాత. ఇలా బాధ్యతారహితంగా ప్రవర్తించే ఆర్టిస్టులను పెట్టుకుని సినిమాలు తీసే నిర్మాతలకు మనోవేదన తప్ప మరేం ఉంటుంది?' అని ఆయన ఆవేదనతో అన్నారు. ఈ నటీనటుల కారణంగా అనుకున్న బడ్జెట్ పెరిగిపోయి, చివరిలో మేం ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వచ్చింది అన్నారు.