twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగా సినిమాకి SMS తలనొప్పి

    By Staff
    |

    Ghajini
    కొద్ది రోజుల్లో రిలీజు కానున్న అమీర్ ఖాన్ గజనీ చిత్రానికి చిత్రమైన తలనొప్పి ప్రారంభమయింది. ఆ సినిమాలో క్లైమాక్స్ ట్విస్ట్ ఇది అంటూ ముంబయి,డిల్లీ వాసులకు ఎస్.ఎమ్.ఎస్ లు వెళ్తున్నాయి. ఆ ఎస్.ఎమ్.ఎస్ లో ఇలా రాసి ఉంది. కొందరు అమీర్ గర్ల్ ప్రెండ్ ని చంపుతారు..ఆ గొడవలోనే అతని మెమరి లాస్ అవుతుంది. చివరకు అతను ఆ కిల్లర్ ని పట్టుకుంటాడు. అతను మరెవరో కాదు...అమీర్ ఖాన్... అంటూ వస్తున్నాయి. ఇది చదివిన చాలా మంది డిసప్పాయింట్ కి గురి అవుతున్నామని లోకల్ మీడియాతో మొరపెట్టుకోవటం జరిగింది.

    ఇక క్లైమాక్స్ తెలిసాక ఇక ఆసక్తి ఏముంటుందనేది వారి ప్రశ్న. నిజంగా సినిమాలో అలాంటి ట్విస్ట్ ఉండదేమో అని అంటే..వారు ఉంటే...చిరాకేస్తుంది కదా అంటున్నారు. సరే ఆ ఎస్.ఎమ్.ఎస్ వచ్చిన నెంబర్ ని బట్టి ఆ వ్యక్తిని పట్టుకోవచ్చు కదా అంటే ఓ ఫ్రీ ఎస్.ఎమ్.ఎస్ ఫెసిలిటీ ఉన్న వెబ్ సైట్ నుంచి అవి వస్తున్నాయిని తెలిసింది. ఇక తమిళంలో సూపర్ హిట్టియిన గజనీ చిత్రాన్ని అదే డైరక్టర్ మురగదాస్ అదే పేరుతో తెరకెక్కుస్తున్నారు. అయితే తమిళ వెర్షన్ లో ఆ తరహా ట్వస్ట్ ఉండదు.మొత్తానికి అమీర్ ఖాన్ గజనీ ప్రమోషన్ కోసం కత్తెర పట్టుకుని అభిమానులకు క్షవరం చేస్తూంటే ...మరో ప్రక్క ఎస్.ఎమ్.ఎస్ లతో కొందరు ఆ సినిమా కలెక్షన్స్ క్షవరం చేయటానికి ప్రయత్నిస్తున్నారు అని బాలివుడ్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X