Don't Miss!
- News కర్ణాటకలో నేడు పోలింగ్ జరిగే లోక్‌సభ నియోజకవర్గాలు ఇవే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అనుష్క 'అరుంధతి' క్రేజ్ ని క్యాష్ ...
అనుష్క హీరోయిన్ గా చేసిన అరుంధతి చిత్రం సూపర్ హిట్ క్రేజ్ క్యాష్ చేసుకోవటానికి '1408 అరుంధతి బంగ్లా' అనే టైటిల్ తో ఓ చిత్రం రాబోతోంది. హాలీవుడ్ హిట్ హారర్ ఫిల్మ్ '1408' కిది డబ్బింగ్. ఈ చిత్రం టైటిల్ కి అరుంధతి బంగ్లా అని కలిపి వదులుతున్నారు. ఈ చిత్రాన్ని లక్ష్మి వెంకటసాయి ఫిలిమ్స్ పతాకంపై ముత్యాల రాందాస్ తెలుగుకు డబ్ చేసి అందిస్తున్నారు.
ఇక ఈ చిత్రంలో '2012 యుగాంతం'లో హీరోగా నటించిన జాన్ కుజాక్ ఈ సినిమాలోనూ హీరోగా చేసారు. అలాగే హాలీవుడ్ స్టార్ ఆర్టిస్టు శామ్యూల్ ఎల్.జాక్సన్ మరో ప్రధాన పాత్ర ధరించాడు. ఇక ఈ చిత్రం కథ ఈ రకంగా సాగుతుంది. మైక్ పాపులర్ హారర్ నవలా రచయిత. దెయ్యాల భవంతులుగా ప్రజల్లో పేరుండే భవనాల్లో పరిశోధనలు చేస్తూంటాడు. అతనికి హోటల్ రూమ్ నెం.1408 గురించి అలాంటి సమాచారమే తెలుస్తుంది. దాంతో ఆ రూమ్ లో ఒక రాత్రి గడపాలని వెళ్లిన అతనికి రకరకాల భయానక అనుభవాలు ఎదురవుతాయి.
ఈ చిత్రం స్టీఫెన్ కింగ్ రాసిన కథ ఆధారంగా రూపొందింది. 'డ్రౌనింగ్ ఘోస్ట్' వంటి గొప్ప హారర్ సినిమాని రూపొందించిన స్వీడిష్ డైరెక్టర్ మైఖేల్ హాఫ్స్ట్రామ్ దర్శకత్వం చేసారు. 120 కోట్ల రూపాయల వ్యయంతో ప్రతిష్ఠాత్మక ఎం.జి.ఎం.(మెట్రో గోల్డ్విన్ మేయర్), డైమెన్షన్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఇప్పటివరకు 640 కోట్ల రూపాయల్ని ఆర్జించింది.