»   » రామ్ చరణ్ ఆ క్లబ్ ని కొనేసాడు

రామ్ చరణ్ ఆ క్లబ్ ని కొనేసాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ చరణ్ కి గుర్రాలన్నా,పోలో ఆట అన్నా చాలా ఇష్టమనే సంగతి తెలిసిందే.ఆ మోజు ఎంతవరకూ వెళ్ళిందంటే అతను రీసెంట్ గా హైదరాబాద్ పోలో జట్టు ని కొనేయటం దాకాను.అంటే అంటే రామ్ ‌చరణ్‌ కూడా ఓ పోలో జట్టును కొన్నారు. ఈ క్రీడపై ఉన్న ఆసక్తితోనే చరణ్‌ 'ఆర్‌.సి.టి. హైదరాబాద్‌ పోలో రైడింగ్‌ క్లబ్‌' అనే జట్టును సొంతం చేసుకొన్నారు. అక్టోబరు నుంచి జరిగే జాతీయ స్థాయి పోటీల్లో ఈ జట్టు పాల్గొననుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు రామ్‌చరణ్‌ త్వరలోనే ప్రకటిస్తారు.

ఇక ప్రస్తుతం రామ్ చరణ్ రచ్చ చిత్రం చేస్తున్నారు .రామ్ చరణ్ తేజ్, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం రచ్చ చిత్రాన్ని మెగా సూపర్ గుడ్ సంస్థ నిర్మిస్తోంది. ఇటీవలే థాయ్ లాండ్, చైనా, బ్యాంగ్ కాక్, శ్రీలంకలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం యూనిట్ ఇప్పుడు హైదరాబాద్ తిరిగి వచ్చింది. డిసెంబర్ లో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వంద శాతం మాస్ సినిమా, చరణ్ పాత్ర తప్పకుండా అన్ని వయసుల వారికి నచ్చేట్టుగా ఉంటుందని చిత్ర నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి ఎన్వి ప్రసాద్, పారస్ జైన్ నిర్మాతలు, సంగీతం: మణిశర్మ

English summary
Ram Charan has out right purchased the Hyderabad Polo and riding club. This club is situated in Aziz nagar village on the outskirts of Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu