చరణ్, వెంకీ మల్టీస్టారర్...నో చెప్పిన సూపర్ స్టార్
ఈ మూవీ కథతో దర్శకుడు కృష్ణ వంశీ సూపర్ స్టార్ కృష్ణను సంప్రదించినపుడు....కథ విని ఆయన ఎంతో ఉత్తేజ పడ్డాడని, అయితే వయసు 70 దాడటంతో చేయడం నా వల్ల కాదంటూ సున్నితంగా తిరస్కరించారని తెలుస్తోంది. దీంతో ఆయన లేకుండానే ఈ మల్టీ స్టారర్ సినిమాను ప్లాన్ చేసుకుంటున్నారట కృష్ణ వంశీ. ఈ చిత్రాన్ని నిర్మాత బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై నిర్మించనున్నారు.
ఇతర వివరాల్లోకి వెళితే..తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈచిత్రంలో హీరో హీరోయిన్లుగా నయనతార, కాజల్ అగర్వాల్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. గతంలో వెంకీ-నయతార లక్ష్మి, తులసి చిత్రాల్లో నటించారు. రామ్ చరణ్-కాజల్ మగధీర, నాయక్ చిత్రాల్లో నటించారు. వీరి మధ్య ఆయా చిత్రాల్లో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఈ నేపథ్యంలో వారిద్దరినీ హీరోయిన్లుగా తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరోల మల్టీ స్టారర్ల ట్రెండ్ ఊపందుకుంది. ఇప్పటికే వెంకటేష్-మహేష్ బాబు మల్టీ స్టారర్‌గా వచ్చిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం మంచి విజయం సాధించింది. మరో వైపు వెంకటేష్-రామ్ మల్టీ స్టారర్ కూడా తెరకెక్కుతోంది. ఇప్పుడు వెంకటేష్-రామ్ చరణ్ మల్టీ స్టారర్ కూడా ఫైనలైజ్ అయింది. వెంకటేష్ తనకోసం ఇలాంటి మల్టీస్టారర్ స్టోరీలు అడిగి మరీ తయారు చేయించుకుని, యంగ్ హీరోలతో చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్.


Click it and Unblock the Notifications












