Don't Miss!
- News రాహుల్ సహా నేడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న కీలక నేతలు వీరే..
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బివివి చౌదరి 'దమ్మున్నోడు' వస్తున్నాడు
ఎట్టకేలకు 'దమ్మున్నోడు' చిత్రం రిలీజ్ కు రెడీ అయింది. హీరో రిషీకి డిమాండ్ ఉన్న రోజుల్లో ప్రారంభమైన ఈ చిత్రం అతనెవరో మర్చిపోయే రోజులకు రిలీజుకు నోచుకుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జనవరి 1న విడుదల చేయనున్నట్టు నిర్మాత రాజు తెలిపారు. ఈ చిత్రానికి బివివి చౌదరి దర్శకుడు. ఆయన విడుదల సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ..హై ఓల్జేజ్ యాక్షన్, లవ్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపొందినట్టు ఆయన చెప్పారు. అలాగే ఈ చిత్రంతో రిషికి యాక్షన్ హీరోగా మంచి ఇమేజ్ వస్తుందనీ, ఇందులోని ఏడు ఫైట్లు మాస్ ను ఎంతో ఆకట్టుకుంటాయనీ అన్నారు. కథాపరంగా ఇందులో మాగంటి సుభాష్ చంద్రబోస్ అనే యువకుడికి పోలీస్ ఆఫీసర్ కావాలనే లక్ష్యం ఉంటుంది. ఇందుకోసం పల్లెటూరి నుంచి నగరానికి వస్తాడు. తన ఆవేశాన్ని, ఆలోచనల్ని రంగరించి ఎస్.పి.స్థాయికి ఎదుగుతాడు. ఆ తర్వాత కథ ఎలాంటి మలుపులు తిరిగిందన్నది ఆసక్తికరంగా ఉంటుందన్నారు. ఈ చిత్రంలో రిషికి జోడిగా సౌమ్య నటించింది. ఇక ఇతర పాత్రలలో యుక్త, నాజర్, రాహుల్ దేవ్, రామిరెడ్డి, సత్యప్రకాష్, నరసింహరావు, హరిత, శ్వేత, శోభ తదితరులు నటించారు. వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు.