Don't Miss!
- Sports కోహ్లి.. అసలు ఇదేం బ్యాటింగ్- సునీల్ గవాస్కర్
- News రేవంత్ రెడ్డి సీటుకు భలే డిమాండ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రంగస్థలం సెట్ చూసి ఆనందంతో అరిచేసిందట: సమంతా ఆనందం చూడండీ
రంగస్థలం 1985' సినిమా కోసం హైదరాబాద్ - భూత్ బంగ్లా సమీపంలో 'జాతర' సెట్ వేశారు. 1980 నాటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఈ సెట్ ను రూపొందించారు. ఈ సెట్ కి సంబంధించిన ఒక స్టిల్ ను చరణ్ రిలీజ్ చేయగా.
Recommended Video
రంగస్థలం 1985' సినిమా కోసం హైదరాబాద్ - భూత్ బంగ్లా సమీపంలో 'జాతర' సెట్ వేశారు. 1980 నాటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఈ సెట్ ను రూపొందించారు. ఈ సెట్ కి సంబంధించిన ఒక స్టిల్ ను చరణ్ రిలీజ్ చేయగా. మరో స్టిల్ ను సమంత వదిలింది. బొమ్మల కొట్లు , రంగుల రాట్నం, జనం సందడితో కలర్ ఫుల్ గా వున్న ఈ స్టిల్ అందరినీ ఆకట్టుకునేలా వుంది.
1980 లోకి తీసుకెళ్లేలా
సెట్స్ లోని ఫొటోలు కొన్ని చూస్తుంటే సినిమా మళ్లీ మనల్ని 1980 లోకి తీసుకెళ్లేలా ఉందని అనిపిస్తోంది. మనాలీలో భార్యతో కలిసి షికారును పూర్తి చేసిన చరణ్, దగ్గుబాటు ఫ్యామిలీతో గెట్ టు గెదర్ పూర్తి చేసిన సమంత నిన్నటి నుంచి ఈ సినిమా షూటింగులో పాల్గొంటున్నారు.
జాతర నేపథ్యంలో
జాతర నేపథ్యంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. గ్రామీణ నేపథ్యంలో జాతర సీన్లు మాస్ ఆడియన్స్ మనసును పట్టేస్తాయనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
స్టార్ హీరో రామ్ చరణ్ లుక్ కూడా చాలా ప్రయోగాత్మకంగా ఉంది.
ఆ సెట్ లోని కొన్ని పోటోలు
సినిమాలో పూర్తిగా ఎలా కనిపిస్తాడా అని అందరు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన ఒక సెట్ చిత్ర యూనిట్ ని చాలా ఆకట్టుకుంటోంది. మొన్న రామ్ చరణ్ ఆ సెట్ లోని కొన్ని పోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులు చూపించిన సంగతి తెలిసిందే.
సమంత ట్విట్టర్ అకౌంట్ ద్వారా
అయితే ఇప్పుడు హీరోయిన్ సమంత కూడా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా మరొక ఫొటోని చూపించింది. సెట్ చాలా బావుంది. సింపుల్ అండ్ బ్యూటిఫుల్ అంటూ.. ఈ సినిమాలో తాను ఒక భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది. అయితే తన పెళ్ళి రిసెప్షన్ తరువాత సమంత సెట్స్ కు వస్తుందని అనుకుంటే.. ముందే వచ్చి అందరికీ షాకిచ్చిందనే చెప్పాలి.
శివమ్ రావ్ వేసిన సెట్స్
ఈ సినిమాలో సుకుమార్ తన జీవితంలోని కొన్ని జ్ఞాపకాలను రంగస్థలంలో చూపించబోతున్నాడట. ఆర్ట్ డైరెక్టర్ శివమ్ రావ్ వేసిన సెట్స్ సినిమాకు చాలా ప్లస్ అవుతాయని చిత్ర యూనిట్ చాలా నమ్మకంతో ఉంది. మరి ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.