Don't Miss!
- News కర్ణాటకలో నేడు పోలింగ్ జరిగే లోక్‌సభ నియోజకవర్గాలు ఇవే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
తొలిప్రేమ ట్విట్టర్ టాక్ : యూత్ పండగ చేసుకునే సినిమా..కానీ..!
Recommended Video
వరుణ్ తేజ్ నటించిన రొమాంటిక్ లవ్ డ్రామా తొలిప్రేమ చిత్రం ఫిబ్రవరి 10 నుంచి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కానీ యుఎస్ లో ఈ చిత్రాన్ని ఒకరోజు ముందుగా అంటే నేడు విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ చిత్ర ప్రీమియర్ షోలు యుఎస్ లో ప్రదర్శించబడ్డాయి. యుఎస్ అభిమానుల నుంచి ఈ చిత్రానికి మంచి టాక్ వస్తోంది. రొమాంటిక్ లవ్ స్టోరీ తరహా చిత్రాలు యుఎస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటాయి.
|
యూఎస్ ప్రీమియర్ షోల నుంచి అద్భుతమైన రెస్పాన్స్
రాశి ఖన్నా, వరుణ్ తేజ్ జంటకు టీజర్ ట్రైలర్ లో ఇప్పటికే మంచి మార్కులు పడ్డాయి. తొలిప్రేమ చిత్రానికి యుఎస్ ప్రీమియర్స్ నుంచి సూపర్ పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి.
|
థమన్ దుమ్ము దులిపేశాడు
తొలిప్రేమ చిత్రంలోని అన్ని పాటలకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. చిత్రంలో బ్యాక్ గ్రౌండ్ సంగీతం కూడా థమన్ అదరగొట్టేశాడు. థమన్ వర్క్ కు ప్రశంసలు దక్కుతున్నాయి.
|
హైలైట్ గా నిలిచిన ఫస్ట్ హాఫ్
తొలిప్రేమ చిత్ర ఫస్ట్ హాఫ్ ఆకట్టుకునే విధంగా ఉంది. వరుణ్, రాశి ఖన్నా తమ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు.
|
సెకండ్ హాఫ్ పరిస్థితి
తొలిప్రేమ చిత్ర సెకండ్ హాఫ్ కు కూడా మంచి పడ్డప్పటికీ కొన్ని సన్నివేశాలు సదా సీదాగా ఉన్నట్లు తెలుస్తోంది. ఓవర్ ఆల్ గా సెకండ్ హాఫ్ ఒకే అనిపించే విధంగా ఉంది.
|
కెమిస్ట్రీ అదిరిందిగా
వరుణ్ తేజ్, రాశి ఖన్నా మధ్య కెమిస్ట్రీ అదిరింది. ఈ జంట కన్నుల విందుగా ఉంది. అలాగే సినిమాటోగ్రఫీకి కూడా మంచి మార్కులు పడ్డాయి.
|
అదిరిపోయిన డైలాగ్స్
డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ చిత్రంలో మంచి డైలాగ్స్ రాసుకునట్లు ఉన్నారు. వరుణ్ తేజ్ పలికే ప్రతి డైలాగ్ అభిమానులని అలరించే విధంగా ఉంది.
|
కథ ఇంకాస్త..
ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ గా తొలిప్రేమ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. కానీ కథ ఇంకాస్త బాగుండాల్సిందనే అభిప్రాయం ఆడియన్స్ నుంచి వ్యక్తం అవుతోంది. ఓవరాల్ గా ఈ చిత్రం యువతని ఆకట్టుకునే విధంగా ఉన్నట్లు తెలుస్తోంది.