For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Beast OTT: ఆ ఓటీటీలో విజయ్ సినిమా.. తెలుగుతో పాటు అన్ని భాషల్లో అప్పటి నుంచే

  |

  తమిళ చిత్ర పరిశ్రమలో సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ స్టార్ హీరోగా వెలుగొందుతోన్నాడు ఇళయదళపతి విజయ్. కెరీర్ ఆరంభం నుంచే విభిన్నమైన చిత్రాలు.. విలక్షణమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తోన్న అతడు.. క్రమంగా భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను సంపాదించుకుంటూ వస్తున్నాడు. అదే సమయంలో దక్షిణాది మొత్తం తన పాపులారిటీని పెంచుకుని మార్కెట్‌ను కూడా విస్తృత పరుచుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే గత ఏడాది 'మాస్టర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అతడు.. భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. దీంతో రెట్టించిన జోష్‌తో ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు.

  ఒకే బెడ్‌పై ప్రియుడితో నయనతార: ఒకరి మీద ఒకరు క్లోజ్‌గా.. ఫొటో బయటకు రావడంతో!

  సౌతిండియన్ స్టార్ ఇళయదళపతి విజయ్ ఇటీవలే 'బీస్ట్' అనే సినిమాలో నటించాడు. దీన్ని 'డాక్టర్' ఫేం నెల్సన్ దిలీప్ తెరకెక్కించాడు. క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ మూవీపై అంచనాలు అంతకంతకూ పెరిగాయి. దీంతో ఈ సినిమా హక్కుల కోసం తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. ఫలితంగా ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాల్లోనూ భారీ బిజినెస్ చేసుకుంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ. 10 కోట్ల బిజినెస్ చేసుకుంది. ఇక, కరోనా ప్రభావం కారణంగా సుదీర్ఘ కాలం పాటు షూటింగ్‌ను జరుపుకున్న ఈ సినిమా.. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది దక్షిణాదిలోని భాషలతో పాటు హిందీలోనూ విడుదలైన విషయం తెలిసిందే.

  Vijay Beast Movie Streaming on Netflix from May 11th

  కోలీవుడ్ స్టార్ విజయ్ నటించిన 'బీస్ట్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మిక్స్‌డ్ టాక్ మాత్రమే వచ్చింది. దీంతో ఈ సినిమాకు కలెక్షన్లు అనుకున్న రీతిలో రాలేదు. అయితే, తమిళంలో మాత్రం దీనికి యాభై కోట్లకు పైగానే షేర్ దక్కింది. అలాగే, అన్ని భాషలనూ కలుపుకుని వంద కోట్ల రూపాయలను సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా.. దీనికి ఆరంభంలో తెలుగు రాష్ట్రాల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ, క్రమంగా ప్రేక్షకుల స్పందన తగ్గిపోయింది. ఫలితంగా ఆరంభంలో భారీ కలెక్షన్లను రాబట్టిన ఈ చిత్రం ఆ తర్వాత నిరాశనే ఎదుర్కొంది. అదే సమయంలో చివరకు నష్టాలను కూడా చవి చూడాల్సి వచ్చింది.

  మరోసారి సమంత హాట్ ట్రీట్: అబ్బో ఆమెను ఈ డ్రెస్‌లో చూశారంటే!

  ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైనా సినిమా విడుదల అవుతుంటే.. ఆ తర్వాత వచ్చే ఓటీటీ స్ట్రీమింగ్ గురించి కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ నటించిన 'బీస్ట్' డిజిటల్ రిలీజ్ గురించి కూడా ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఓటీటీ పార్ట్‌నర్, స్ట్రీమింగ్ డేట్ గురించి కూడా చాలా రకాల పుకార్లు వచ్చాయి. అయితే, చిత్ర యూనిట్ మాత్రం వాటిని ఖండించింది. ఇక, తాజాగా ఈ సినిమా మే 11 నుంచి స్ట్రీమింగ్ కాబోతుందని అధికారిక ప్రకటన వెలువడింది. దీన్ని నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ రిలీజ్ చేయబోతున్నారు. తమిళంతో పాటు తెలుగు, హిందీలోనూ ఈ సినిమా అందుబాటులోకి రాబోతుందని వెల్లడించారు.

  ఇళయదళపతి విజయ్ ప్రధాన పాత్రలో నెల్సన్ దిలీప్ తెరకెక్కించిన చిత్రమే 'బీస్ట్'. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. యంగ్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ దీనికి సంగీతం అందించాడు. ఈ సినిమాలో సెల్వ రాఘవన్, యోగి బాబు తదితరులు కీలక పాత్రలు చేశారు.

  English summary
  Kollywood Star Hero Vijay Did Beast Movie Under Nelson Dilipkumar Direction. This Movie Streaming on Netflix from May 11th.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X