twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Rudra Web Series Review : అజయ్ దేవగన్, రాశి ఖన్నాలు నటించిన క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

    |

    Rating : 2.5/5

    ఓటీటీ:డిస్నీ + హాట్‌స్టార్‌
    నటుడు:అజయ్ దేవగన్ , రాశి ఖన్నా, ఈషా డియోల్, ఆశిష్ విద్యార్థి, అతుల్ కులకర్ణి
    దర్శకుడు : రాజేష్ మపుస్కర్
    నిర్మాణం: అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్‌


    అజయ్ దేవగన్ నటించిన వెబ్ సిరీస్ 'రుద్ర' డిస్నీ + హాట్‌స్టార్‌లో విడుదలైంది. అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ద్వారా అజయ్ దేవగన్ తన OTT అరంగేట్రం చేశారు. అయితే, రుద్ర కంటే ముందు, అజయ్ దేవగన్ భుజ్ చిత్రం ద్వారా OTT ప్లాట్‌ఫామ్‌లో ఎంట్రీ ఇచ్చారు. కానీ అది సినిమా కాగా ఇది మాత్రం వెబ్ సిరీస్. ఇక ఈ సిరీస్ కు ముందు నుంచి ప్రమోషన్స్ మొదలుపెట్టడం టీజర్, ట్రైలర్ సిరీస్ మీద ఆసక్తి పెంచాయి. దానికి తోడు రాశి ఖన్నా కూడా నటించడంతో సిరీస్ మీద ఆసక్తి పెరిగింది. మరి ఆ సిరీస్ ఉంది? ఆ కథ ఏంటి? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

     ''రుద్ర'' కథ ఏమిటి?

    ''రుద్ర'' కథ ఏమిటి?

    ముంబై పోలీసుల స్పెషల్ క్రైమ్ యూనిట్లో రుద్ర వీర్ సింగ్(అజయ్ దేవగన్) డిసిపిగా పని చేస్తూ ఉంటారు. నేరస్తులను పట్టుకోవడానికి, వారికి గుణపాఠం చెప్పడానికి చట్టాన్ని ఉల్లంఘించడానికి కూడా రుద్ర వెనుకాడడు. కాబట్టి అత్యంత ప్రమాదకరమైన కేసులను కూడా సాల్వ్ చేసేందుకు ఆయనకే అప్పగిస్తూ ఉంటారు పై అధికారులు. ఈ కారణంగా అతని వ్యక్తిగత జీవితం కూడా ప్రభావితమవుతుంది. అయితే ఒక కేసు కారణంగా సస్పెన్షన్లో ఉన్న రుద్ర సస్పెన్షన్ ముంబై నగరంలో నేరాలు పెరుగుతున్నందున రద్దు చేయబడింది. ఈ నేరాలను ఆపడానికి రుద్రకు సమయం తక్కువ ఉంటుంది. ఆ కేసులోనే ఆయన మానసిక రోగి అయిన అలియా(రాశీ ఖన్నా)ని కలుస్తాడు. ఆ కేసును సాల్వ్ చేసే ఉద్దేశ్యంతో ఆమెతో స్నేహం చేస్తాడు. అయితే కథగా చెప్పాలంటే ప్రతి ఎపిసోడ్‌లో ఒక కొత్త విలన్ ఉంటారు. రుద్ర ఆ ఆరుగురిని ఎలా అడ్డుకున్నాడు? వారి నుంచి నిజాలు ఎలా రాబట్టారు? అనేదే కథ.

    ఎలా ఉంది అంటే?

    ఎలా ఉంది అంటే?

    రుద్ర బ్రిటిష్ సిరీస్ లూథర్ యొక్క అధికారిక హిందీ రీమేక్. ఇందులో మొత్తం 6 ఎపిసోడ్‌లు ఉన్నాయి. షో ఒక్కో ఎపిసోడ్ కథ దోపిడీకి సంబంధించినది కాగా మిగిలిన ఐదు ఎపిసోడ్‌లు హత్య మిస్టరీపై ఆధారపడి ఉంటాయి. అద్భుతమైన విషయం ఏమిటంటే రుద్ర ప్రతి ఎపిసోడ్‌లో మీకు భిన్నమైన కథ అందించారు. ఆ అన్ని ఎపిసోడ్స్ చూస్తుంటే క్రైమ్ నేపథ్యంలో తీసిన బాలీవుడ్ సినిమాలు అనేకం గుర్తుకు వస్తాయి. ఓ వైపు షోలో క్రిమినల్ ఛేజింగ్ జరుగుతుండగానే రుద్ర వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కథను కూడా కలిపేలా అల్లుకున్నారు. భార్య శైలా(ఈషా డియోల్)తో రుద్ర విడిపోవడం. తన సీనియర్లు మరియు జూనియర్లతో రుద్ర ప్రవర్తించే తీరు భిన్నంగా ఉంటుంది. ఒరిజినల్ ని భారతీయ ప్రేక్షకులకు అభిరుచికి అనుగుణంగా తీర్చిదిద్దేందుకు మేకర్స్ చాలా కష్టపడటం కనిపించింది. అయితే ఎంత క్రైమ్ థ్రిల్లర్ అయినా సాగతీత లేకుండా ఎపిసోడ్‌ల నిడివి కొంచెం తక్కువగా ఉంటే బాగుండేది, అసలు సిరీస్‌లో భాగం కాని కొన్ని కొత్త కేసులను జోడించే ప్రయత్నం చేయాల్సింది. మొత్తంగా చూసుకుంటే టైం పాస్ కోసం తప్ప అంత ఎంగేజింగ్ గా అయితే లేదు ఈ థ్రిల్లర్.

     ఎవరు ఎలా చేశారు అంటే

    ఎవరు ఎలా చేశారు అంటే

    రుద్ర: ది ఏజ్ ఆఫ్ డార్క్‌నెస్ సిరీస్ మొత్తం అజయ్ దేవగన్ వన్ మ్యాన్ షో అని చెప్పక తప్పదు. అజయ్ కి బిల్డప్ ఇవ్వడానికే అన్నట్టు అనేక తెలివైన క్రిమినల్ పాత్రలు సృష్టించబడ్డాయి. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో అజయ్‌ని మించిన వారు లేరు అన్నట్టు చూపేందుకు ప్రయత్నించారు. రుద్ర మొదటి మూడు ఎపిసోడ్స్ అనుకున్నంత అద్భుతంగా లేవు కానీ అజయ్ దేవగన్ నటన ఒక్కటే సిరీస్ మీద ఆసక్తి పెంచింది. రాశి ఖన్నా కూడా తన పాత్రలో చాలా బాగా సెట్ అయింది. కానీ ఈషా డియోల్ తన పాత్రలో సెట్ అయినట్టు అనిపించలేదు. మరోవైపు, మిలింద్ గునాజీ, అశ్విని కల్సేకర్, అతుల్ కులకర్ణి మరియు ఆశిష్ విద్యార్థి తమ పాత్రల పరిధి మేర నటించారు. బాధాకరమైన విషయమేమిటంటే వారికి కావాల్సినంత స్క్రీన్ స్పేస్ లభించక పోవడమే.

    టెక్నీకల్ విషయానికి వస్తే

    టెక్నీకల్ విషయానికి వస్తే


    చాలా డబ్బు వెచ్చించి ఈ సిరీస్ ను చిత్రీకరించారు, ఆ రిచ్ నెస్ సిరీస్ లో కనిపించింది. కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. కెమెరా వర్క్ కూడా బాగుంది. కానీ బలహీనమైన కథనం, సిరీస్ లో లాగ్ మిగతా అన్ని విషయాలను డామినేట్ చేసింది. ఎడిటింగ్‌ మీద ఫోకస్ పెట్టకపోవడంతో ఒక్కో సారి చిరాకు కూడా అనిపిస్తుంది. ఇక ఇప్పుడు వస్తున్న అన్ని సిరీస్ లలో చూపినట్టే ఇందులో కూడా అనవసర రక్తపాతం చూపబడింది.

    ఇక ఫైనల్ గా చెప్పాలంటే

    ఇక ఫైనల్ గా చెప్పాలంటే


    క్రైమ్-థ్రిల్లర్స్ మీద మీకు ఆసక్తి లేకపోతే 'రుద్ర' ను ఎంజాయ్ చేయడం కష్టమే. అజయ్ దేవగన్ అభిమానులు అయితే సిరీస్ ను బాగా ఎంజాయ్ చేయగలరు.

    English summary
    here is the review of Ajay Devgan, Rashi Khanna, Esha Deol's Rudra: The Edge Of Darkness Review. అ
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X