Don't Miss!
- Automobiles విమానంలో ప్రేమ కావ్యం.. అద్భుతమైన సన్నివేశానికి ఫిదా అవుతున్న నెటిజన్లు
- Finance Uday Kotak: కోటక్ బ్యాంక్ స్టాక్ క్రాష్.. పాపం ఉదయ్ కోటక్.. ఎంత నష్టపోయారంటే..
- Sports కోహ్లి.. అసలు ఇదేం బ్యాటింగ్- సునీల్ గవాస్కర్
- News రేవంత్ రెడ్డి సీటుకు భలే డిమాండ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రధాని మోదీని వెనక్కి నెట్టేశాడు.. కమెడియన్ గురించి ట్విట్టర్లో సంచలనం, ప్రార్థనలు!
దేశంలో అన్ని ప్రాంతాల్లో నరేంద్రమోదీ రెండో సారి ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తుండటం గురించి చర్చించుకుంటుంటే... తమిళనాడులో మాత్రం అందుకు భిన్నమైన చర్చసాగుతోంది. ఇక్కడంతా ఇపుడు 2001లో విడుదలైన తమిళ చిత్రం 'ఫ్రెండ్స్'లోని నేసమణి పాత్ర గురించి మాట్లాడుకుంటున్నారు.
పాకిస్థాన్‌కు చెందిన ట్విట్టర్ యూజర్ ఒకరు.... హమ్మర్ ఫోటో పోస్ట్ చేసి మీ దేశంలో దీన్ని ఏమంటారు? అని ఓ పోస్ట్ పెట్టారు. దీనికి ఓ తమిళియన్ సమాధానం ఇస్తూ మేము దీన్ని 'సుత్తి' అని పిలుస్తామని పేర్కొన్నారు. దీన్ని ఉపయోగించే నేసమణిని అతడి అల్లుడు గాయపరిచాడు అంటూ కామెంట్ పెట్టారు. దీంతో కొందరు స్పందిస్తూ ప్రస్తుతం నేసమణి పరిస్థితి ఏమిటి? అని అడగటం మొదలు పెట్టారు.
|
మోదీని వెనక్కి నెట్టేసింది
క్రమక్రమంగా నేసమణి చర్చ సోషల్ మీడియాలో వైరల్ అయింది. #Pray_For_Neasamani, #Nesamani అనే ట్యాగ్స్ ట్విట్టర్‌ను ముంచెత్తాయి. ఇది ఏ స్థాయిలో వైరల్ అయిందంటే... అప్పటి వరకు ట్విట్టర్లో నెం.1 స్థానంలో ఉన్న #ModiSarkar2 వెనక్కి నెట్టేసింది.
షాకైన వడివేలు
తను పోషించిన పాత్ర గురించి చర్చ ట్విట్టర్లో వైరల్ కావడంతో ఎట్టకేలకు తమిళ కమెడియన్ వడివేలు రియాక్ట్ అయ్యారు. ఓ మీడియా సంస్థ ఈ విషయమై అతడిని సంప్రదించగా.. తానకు ట్విట్టర్లో ఏం జరుగుతుందో తెలియదని, మీరు చెప్పిన తర్వాతే దీని గురించి తెలిసిందని తెలిపారు.
ప్రార్థనలు చేస్తారనుకోలేదు
నేసమణి అనే పాత్రను విజయ్, సూర్య కలిసి నటించిన ‘ఫ్రెండ్స్' అనే మూవీలో చేశాను. దీంతో పాటు ఎన్నో సినిమాల్లో నటించి నవ్వించాను. అయితే నేసమణి ప్రార్థనలు చేస్తూ గురించి ట్విట్టర్లో ఇంతలా ట్రెండ్ అవుతుందనే విషయం తనకు తెలియదని వడివేలు చెప్పుకొచ్చారు.
విజయ్‌తో చివరగా
నేసమణి లాంటి పాత్ర చేసే అవకాశం రావడం తనకు దేవుడు ఇచ్చిన బహుమతిగా వడివేలు పేర్కొన్నారు. తమిళంలో అత్యధిక చిత్రాల్లో నటించిన కమెడియన్లలో వడివేలు ఒకరు. విజయ్‌తో కలిసి అతడు చివరగగా 2017లో వచ్చిన మెర్సల్ చిత్రంలో నటించారు.