For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6 ఇనయాతో బిగ్ బాస్ కామెడీ.. జీవితంలో ఆ పని చేయలేదా అంటూ!

  |

  బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 అనూహ్య పరిణామాలతో దూసుకుపోతోంది. ఎన్నో అనుమానాలు, అంచనాల మధ్య ప్రారంభమైన ఈ సీజన్ దాదాపుగా పూర్తి దశకు చేరుకుంది. ఇప్పటికీ 13 వారాలు పూర్తి చేసుకుని 14వ వారంలోకి అడుగుపెట్టింది. మరికొన్ని రోజుల్లో టైటిల్ విన్నర్ ను ప్రకటించనున్నారు. ఇందుకోసం ప్రస్తుతం హౌజ్ లో ఉన్న ఏడుగురు కంటెస్టెంట్స్ గట్టి పోటి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. వీరందరిలో లేడి టైగర్ గా తనదైన ఆట తీరుతో ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది ఇనయా సుల్తానా. రెండు వారాళ్లో వెళ్లిపోతుందనుకున్న ఇనయా టైటిల్ విన్నర్ రేసులో ముందుకుసాగుతోంది. తాజాగా ఆమెతో బిగ్ బాస్ కామెడీ చేశాడు. ఈ వివరాల్లోకి వెళితే..

  ఇప్పుడిప్పుడే ఆదరణ..

  ఇప్పుడిప్పుడే ఆదరణ..

  తెలుగు బుల్లితెరపై అత్యధిక రేటింగ్‌తో సంచలనాలను సృష్టిస్తూ నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఎవరూ ఊహించని కంటెంట్‌తో సాగే దీనికి ప్రేక్షకులు ఆశించిన దానికంటే ఎక్కువ స్పందననే అందించారు. ఫలితంగా తెలుగులో ఇది వరుసగా సీజన్లను పూర్తి చేసకుంటూ వస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరోది కూడా ప్రారంభం అయింది. దీనికి ఇప్పుడిప్పుడే ఆదరణ క్రమంగా పెరుగుతోంది.

  ఆర్జీవీతో కలిసి చిందులు..

  ఆర్జీవీతో కలిసి చిందులు..

  ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి ఎంతో మంది సెలెబ్రిటీలు అడుగు పెట్టారు. అందులో ఆర్జీవీ ద్వారా పాపులర్ అయిన ఇనయా సుల్తానా ఒకరు. ఇనయా బర్త్ డేకు గెస్ట్ గా వెళ్లిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఆమెతో కలిసి పార్టీలో చిందులేశారు. దీంతో ఆమె ఒక్కసారిగా పాపులర్ అయిపోయంది. అలాగే పలు విమర్శలు కూడా ఎదుర్కొంది. అదే ఆమెకు బిగ్ బాస్ ఎంట్రీకి అవకాశంగా మారిందని పలువురు అనుకుంటున్నారు.

  అతనికి గట్టిపోటిగా..

  అతనికి గట్టిపోటిగా..

  బర్త్ డే పార్టీలో ఆర్జీవీతో కలిసి డ్యాన్స్ చేయడానికి ముందే పలు చిత్రాల్లో కూడా నటించింది ఇనయా సుల్తానా. ఇక బిగ్ బాస్ హౌజ్ లోకి ఎలాంటి అంచనాలు లేకుండా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ రెండు వారాళ్లో వెళ్లిపోతుందని అంతా అనుకున్నారు. కానీ తనదైన ఆట తీరుతో ఇప్పటివరకు ఆకట్టుకోవడమే కాకుండా టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగిన రేవంత్ కు గట్టి పోటీ అని ప్రేక్షకులు భావిస్తున్నారు.

  ఆరోహి ఎలిమినేట్ కావడంతో..

  ఆరోహి ఎలిమినేట్ కావడంతో..

  బిగ్ బాస్ హౌజ్ లో ఇనయాకు తొలిసారిగా బాత్రూమ్ విషయంలో గీతూ రాయల్ తో గొడవ మొదలైంది. తర్వాత శ్రీహాన్ తో పిట్ట గొడవ కొద్ది రోజులు నడిచింది. ఈ క్రమంలోనే ఆరోహి రావు ఎలిమినేట్ అయ్యాక ఇనయా, ఆర్జే సూర్యల మధ్య బాండింగ్ పెరిగింది. తరచు ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం, హగ్స్ ఇచ్చుకోవడం వంటివి జరిగాయి. దీంతో ఒక వారమంతా ఇనయాలో ఫైర్ లేకుండా పూర్తిగా కనిపించకుండా పోయింది.

  ఫిజికల్ టాస్కుల్లో గట్టి పోటీ ఇస్తూ..

  ఫిజికల్ టాస్కుల్లో గట్టి పోటీ ఇస్తూ..

  వీకెండ్ లో నాగార్జున చెప్పడం, ఆర్జే సూర్య ఎలిమినేట్ కావడంతో మళ్లీ పూర్తిగా గేమ్ ట్రాక్ లోకి వచ్చింది ఇనయా సుల్తానా. ఇక అప్పటినుంచి ప్రేక్షకుల మన్ననను పొందేలా తన ఆట తీరును మెరుగుపరుచుకుంది. ఫిజికల్ టాస్క్ ల్లో సైతం గట్టి పోటి ఇస్తూ అబ్బాయిలకు సరిసమానమనేలా లేడీ టైగర్ అనిపించుకుంది. టైటిల్ విన్నర రేస్ లో పరిగెడుతున్న రేవంత్ కు ఇనయా మాత్రమే గట్టి పోటి అని చెప్పుకునే స్థాయికి ఎదిగింది బ్యూటిఫుల్ ఇనయా సుల్తానా.

  బ్యాలెట్ లో ఓటింగ్ పేపర్..

  బ్యాలెట్ లో ఓటింగ్ పేపర్..

  ఇక తాజాగా జరిగిన ఎపిసోడ్ లో బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ నుంచి తగ్గిన డబ్బును తిరిగి గెలిచేందుకు ఛాలేంజ్ ఇచ్చాడు బిగ్ బాస్. మొదటి ఛాలేంజ్ లో రోహిత్, శ్రీసత్య పాల్గొన్నారు. అయితే వారిలో ఎవరు గెలుస్తారు, ఎవరు గెలవరు అనే విషయాన్ని ఇంటి సభ్యులు ఎక్స్ మార్క్ తో రాసిన పేపర్ బ్యాలేట్ బాక్స్ లో వేయమని చెప్పారు. అందరూ సక్రమంగా పేపర్ వేసి వెళ్లారు.

  బిగ్ బాస్ ప్రశ్నకు సిగ్గుపడిన ఇనయా..

  బిగ్ బాస్ ప్రశ్నకు సిగ్గుపడిన ఇనయా..

  ఇనయా సుల్తానా వచ్చి తను శ్రీసత్య ఓడిపోతుందని భావించి ఆమె ఫొటోపై ఎక్స్ మార్క్ చేసింది. తర్వాత ఆ పేపర్ చింపేందుకు ప్రయత్నించింది. అలా ఎందుకు అలానే ఉంచి ఎక్స్ మార్క్ పెడదామని పెట్టి మడిచింది. దీంతో రోహిత్ పై కూడా ఎక్స్ మార్క్ పడింది. అయ్యో రోహిత్ పై కూడా పడిందే అనుకుంటూ ఎలా అని ఆలోచిస్తుంటే "ఇనయా.. మీరు ఇంతకుముందు ఎప్పుడు ఓటు వేయలేదా" అని బిగ్ బాస్ ప్రశ్నించాడు. దాంతో ఆమె నవ్వుతూ, సిగ్గుపడుతూ వేయలేదు బిగ్ బాస్ అని చెప్పింది. తర్వాత శ్రీసత్యపై రెండు ఎక్స్ మార్క్స్ వేసి పేపర్ బ్యాలేట్ లో వేసింది. ఈ ప్రక్రియ అంతా చాలా కామెడీగా జరిగింది.

  English summary
  Bigg Boss Comedy With Inaya Sultana About Ballot Voting In December 5 Day 92 Episode 93 Highlights
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X