For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

XXX సీన్లలో నటిస్తే.. అలా నీచంగా పిలుస్తారా? మండిపడ్డ లక్స్ పాప!

|

నరసింహ నాయుడు సినిమాలో లక్స్ పాప‌.. లక్స్ పాప పాటలో కనిపించిన ఆషా సైనీ గుర్తుందిగా.. అప్పట్లో తెలుగులో హడావిడి చేసిన ఈ బ్యూటీ ఆఫర్లు లేకపోవడంతో బాలీవుడ్‌కు మూటా ముళ్లే సర్దుకొని వెళ్లింది. పేరు మార్చుకొని ఫ్లోరా సైనీగా అక్కడ సినిమా ఆఫర్లను దొరకపట్టుకొంటూనే పెద్దలు మాత్రమే చూసే షార్ట్ ఫిలింస్‌లో నటిస్తున్నది. తాజాగా ఆమె నటించిన సీజన్డ్ విత్ లవ్ అనే షార్ట్ ఫిలింపై హాట్ హాట్‌గా చర్చ జరుగుతున్నది. తాజాగా బోల్డ్ సీన్లలో నటించడం ఎలా ఉందని అడిగితే మీడియాపై ఈ అందాల సుందరి మండిపడింది. ఇంతకు ఏం జరిగిందంటే..

 షార్ట్ ఫిలింస్‌లో శృంగార తారగా

షార్ట్ ఫిలింస్‌లో శృంగార తారగా

ఫ్లోరా సైనీ అలియాస్ అశా షైనీ గందీ బాత్, xxx సెన్సార్డ్, మేడ్ ఇన్ ఇండియా అనే ఘాటు చిత్రాల్లో నాటుగా కనిపించింది. దాంతో బోల్డ్ హీరోయిన్, హాట్ హీరోయిన్ అనే పేర్లతో పిలువడం మొదలైంది. అలా పిలవడంపై స్పందిస్తూ.. సినీ ప్రముఖులు, ప్రేక్షకులు నన్ను అలా పిలువ కూడదు. మహిళ తారలతో మీడియా బాధ్యతగా వ్యవహరించాలి అని హితబోధ చేసింది.

డిమాండ్ చేస్తే తప్పదు

డిమాండ్ చేస్తే తప్పదు

యాక్టర్ అంటే రకరకాల పాత్రలను పోషించాల్సి ఉంటుంది. అంత మాత్రాన చీప్‌గా చూడకూడదు. కథ డిమాండ్ చేయడం వల్ల కొన్ని సీన్లలో తప్పక నటించాల్సి ఉంటుంది. మా ప్రతిభను రుజువు చేసుకోవడానికి పలు రకాల సినిమాల్లో నటించాల్సి ఉంటుంది. అలాగని మమ్మల్ని బోల్డ్ యాక్టర్ అంటే బాధగా ఉంటుంది అని ఫ్లోరా సైనీ అన్నారు.

 హీరోలను అలా పిలిచే దమ్ముందా?

హీరోలను అలా పిలిచే దమ్ముందా?

సినిమా పరిశ్రమలో హీరోలతో పోలీస్తే హీరోయిన్లపై వివక్ష కొనసాగుతున్నది. నాతో కలిసి శ‌ృంగార సన్నివేశాల్లో నటించిన హీరోలను బోల్డ్ యాక్టర్ అని పిలిచే దమ్ముందా అని ఫ్లోరా సైనీ ప్రశ్నించారు. మహిళలంటే ఎందుకు ఇంత వివక్ష అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు నేను పోషించిన పాత్రలను చూస్తే నాకు గర్వంగా ఉంటుంది అని ఫ్లోరా సైనీ తెలిపారు.

బోల్డ్ సీన్లలో అలా చేస్తే

బోల్డ్ సీన్లలో అలా చేస్తే

బోల్డ్ సీన్ల చేయడం వెనుక నా ప్రతిభను నిరూపించుకోవాలన్నదే నా అభిమతం. నా టాలెంట్ చూసి మరిన్నీ అవకాశాలు రావాలని కోరుకొంటున్నాను. సీజన్డ్ విత్ లవ్‌లో నటించిన హీరోను బోల్డ్ సీన్లలో నటించడం ఎలా ఉందని ఎవరైనా అడుగుతారా? నన్నే ఎందుకు అడుగాలనుకొంటున్నారు. ఇలాంటి ప్రశ్నలను అడగడం మానుకోవాలని ఆమె సూచించారు.

బాలీవుడ్‌లో స్త్రీ మూవీలో

బాలీవుడ్‌లో స్త్రీ మూవీలో

బాలీవుడ్‌లో ఫ్లోరా సైనీ నటించిన స్త్రీ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో శ్రద్ధాకపూర్, రాజ్ కుమార్ రావుతో కలిసి ఆమె నటించారు. గతంలో దర్శకుడు నాగేష్ కుకునూరు తీసిన సిటీ ఆఫ్ డ్రీమ్స్‌ అనే షోలో కూడా కనిపించారు. అమెజాన్ ప్రైమ్‌లో ఇన్‌సైడ్ ఎడ్జ్ 2 కూడా ఆమె కీలక పాత్రను పోషించారు.

English summary
“My Acting Skills Goes Beyond ‘Bold Scenes'”: Flora SainiFlora recounted how during a media interaction for her latest short film "Seasoned With Love", she was asked, "How does it feel to act in bold scenes".By IANS -May 2, 2019Actress Flora Saini, who has featured in web series like “Gandi Baat“, “XXX Uncensored” and “Maid In India“, says filmmakers and viewers should stop tagging her as a ‘bold actress. She also wants the media to be more responsible while posing questions to female actors.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more