Don't Miss!
- News రేవంత్ రెడ్డి సీటుకు భలే డిమాండ్
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నాని తో పోగొట్టుకున్నది నాగచైతన్య తో రాబట్టనున్నారా ..?
నాని , సుధీర్ బాబు కలిసి నటించిన సినిమా" వి " . టాలీవుడ్ లో మంచి అభిరుచి కలిగిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కరోనా మహమ్మారి దెబ్బకు థియేటర్స్ లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది, నిజానికి యావరేజ్ టాకే ఎక్కువచ్చింది. ఈ సినిమాను బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించారు.
అయితే ఈ సినిమా కథ రాజుగారికంటే ముందు మైత్రి మూవీ మేకర్స్ దగ్గరకు వెళ్లిందట కథ కూడా నచ్చడంతో సుమారు 60, 70 కోట్లతో ఈ సినిమాను నిర్మించాలని మేకర్స్ కూడా భావించారట కానీ హీరో నానికి ఆ రేంజ్ మార్కెట్ లేకపోవడంతో వెనక్కి తగ్గారని తెలుస్తుంది.
ఆతర్వాత ఇంద్రగంటి ఈ కథను దిల్ రాజు దగ్గరకు తీసుకువెళ్లడంతో సినిమా పట్టాలెక్కింది. అంతా బాగానే ఉంది. అనుకున్న సమయానికి సినిమా థియేటర్స్ లో విడుదలై ఉండిఉంటే ఆశించినంత లాభాలు తెచ్చిపెట్టేదేమో .. కానీ ఓటీటీ అవ్వడం వల్ల గుడ్డిలో మెల్ల అన్నటుగా దిల్ రాజును బయట పడేసింది 'వి'. అయితే ఈ నష్టాన్ని పూడ్చడానికి దిల్ రాజు మాస్టర్ ప్లాన్ వేసాడు. ఇంద్రగంటితో మరో సినిమాను తెరకెక్కించాలని భావిస్తున్నాడు.
ఈసారి ప్రయోగాలకు పోకుండా ఫన్నీ కాన్సెప్ట్ తో ప్రేక్షకులను నవ్వించి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య హీరో గా ఇంద్రగంటి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు సిద్దమవుతున్నాడు దిల్ రాజు. ప్రస్తుతం నాగచైతన్య శేఖర్ కమ్ముల 'లవ్ స్టోరీ' సినిమా , అలాగే విక్రమ్ కుమార్ 'థాంక్యూ' సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత ఇంద్రగంటి సినిమాను పట్టాలెక్కించాలని చూస్తున్నాడు ఈ బడా ప్రొడ్యూసర్. ఇలా నాని సినిమాతో పోగుట్టుకున్నదాన్ని నాగచైతన్య సినిమాతో రాబట్టుకోవాలని చూస్తున్నాడు దిల్ రాజు. చూడాలి మరి రాజుగారు సక్సెస్ అవుతారో లేదో చూడాలి.