Don't Miss!
- News
అమెరికా-చైనా మధ్య యుద్ధం?
- Sports
అందుకే ఉమ్రాన్‌ను పక్కనపెట్టి చాహల్‌ను తీసుకున్నాం: హార్దిక్ పాండ్యా
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
బెల్లంకొండ సినిమాపై కన్నేసిన బాలీవుడ్ స్టార్ హీరో.. తెలుగు దర్శకుడితోనే..
టాలీవుడ్ రిచేస్ట్ కిడ్స్ లలో ఒకరైన బెల్లంకొండ శ్రీనివాస్ జయాపజయాలను ఏ మాత్రం లెక్క చేయకుండా సినిమాలు చేస్తున్నాడు. డిజాస్టర్ వచ్చినా కూడా ఈ హీరో కెరీర్ పై ఏ మాత్రం ప్రభావం పడడం లేదు. ప్రతి సినిమాను కూడా మార్కెట్ కు మించి ఖర్చు చేస్తుండడం ఇప్పటికి కూడా ఒక మిస్టరీగానే ఉంది. అయితే అప్పుడప్పుడు బెల్లంకొండ కొన్ని సినిమాలతో పరవాలేదు అనిపిస్తున్నాడు.
చివరగా రాక్షసుడు సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. తమిళ్ మూవీ రాట్ససన్ కు రీమేక్ గా వచ్చిన ఆ సినిమాను రమేష్ వర్మ డైరెక్ట్ చేశాడు. మొత్తానికి తెలుగులో కూడా ఆ కథ సక్సెస్ కావడంతో ఇప్పుడు హిందీలో కూడా రీమేక్ కానున్నట్లు సమాచారం. ఇక ఆ సినిమాను రీమేక్ చేయబోయే హీరో మరెవరో కాదు. టాలెంటెడ్ ఆల్ రౌండర్ అక్షయ్ కుమార్ అని తెలుస్తోంది.

అక్షయ్ కుమార్ సౌత్ సినిమాలను రీమేక్ చేయడంలో సిద్ధహస్తుడు. మినిమమ్ హిట్ అయ్యేలా తెరపైకి తెస్తుంటాడు. ఇక చివరగా చేసిన కాంచన మాత్రం బెడిసికొట్టింది. ఇక ఇప్పుడు రమేష్ వర్మ దర్శకత్వంలోనే రాట్ససన్ ను బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం. తెలుగులో అయితే కథను పెద్దగా చేంజ్ చేయలేదు. కానీ హిందీలో కొన్ని మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి హిందీలో ఆ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.