Don't Miss!
- News రాహుల్ సహా నేడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న కీలక నేతలు వీరే..
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సంజూ టీజర్.. అదరగొట్టేసిన రణ్‌బీర్. అచ్చం సంజయ్‌దత్ మాదిరిగానే..
సినీ అభిమానులు, సంజయ్ దత్, రణ్‌బీర్ కపూర్ ఫ్యాన్స్ ఎదురు చూసిన సంజు మూవీ టీజర్ వచ్చేసింది. ఈ టీజర్లో రణ్‌బీర్ లుక్స్ పరంగానే కాకుండా హావభావాలతో అదరగొట్టేశాడు. సంజయ్ దత్ జీవితంలోని భిన్న రకాల గెటప్స్‌తో అదరగొట్టేశాడు. అయితే ఈ టీజర్లో కేవలం సంజయ్ రూపంలో ఉండే రణ్‌బీర్ కపూర్ మాత్రమే కనిపిస్తాడు. మిగితా ఏ ఒక్క నటి గానీ, నటుడు గానీ కనిపించరు. ఈ చిత్రంలో అనుష్కశర్మ, సోనమ్ కపూర్, మనీషా కోయిరాలా, దియా మిర్జా, కరీష్మా తన్నా, దియా మిర్జా తదితరులు నటించారు. ఈ చిత్రం జూన్ 29న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది.
సంజూ టీజర్‌ను దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. రెగ్యులర్‌గా తీసే సినిమాల కంటే బయోపిక్ చేయడం సవాల్‌తో కూడినది. స్క్రిప్టు రూపొందించడం కత్తి మీద సాముగా మారింది. సంజయ్ దత్ జీవితం వివాదాలమయమే కాకుండా స్ఫూర్తిని కలిగిస్తుంది. అలాంటి కఠినమైన జీవితాన్ని తెరకెక్కించడమంటే ఆషామాషీ కాదు అని రాజ్ కుమార్ హిరాణీ అన్నారు.