Don't Miss!
- News రాహుల్ సహా నేడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న కీలక నేతలు వీరే..
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆరో రోజు 'రూలర్'.. సెలవు దినం కావడంతో.. ఇలా అయితే కష్టమే!
నందమూరి బాలకృష్ణ హీరోగా తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'రూలర్'. భారీ అంచనాల నడుమ ఈ సినిమా డిసెంబర్ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. రూలర్‌పై మొదటినుంచే హైప్ క్రియేట్ చేసిన చిత్రయూనిట్ తొలి రోజే మిశ్రమ స్పందన తెచ్చుకొని ఫర్వాలేదనిపించుకుంది. ఆ తర్వాతి రోజుల్లో రూలర్ కలెక్షన్స్ క్రమంగా తగ్గాయి.
సెలవు దినాల్లో కూడా రూలర్ ఎఫెక్ట్
రూలర్ పై నందమూరి అభిమానులు పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయని తాజా రిపోర్ట్స్ చెబుతున్నాయి. తాజా కలెక్షన్స్, రూలర్ పై ప్రేక్షకుల తాకిడి చూస్తుంటే ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెంట్ అందుకోవడం కష్టమే అని స్పష్టమవుతోంది. క్రిస్మస్ సెలవు దినాల్లో కూడా రూలర్ ఎఫెక్ట్ పెద్దగా కనిపించక పోవడం గమనార్హం.
ఈ ఆరు రోజుల్లో కలిపి మొత్తంగా..
రెండు తెలుగురాష్ట్రాల్లోని బీ, సి సెంటర్లలో ఓకే అనిపించుకున్న రూలర్ ఈ ఆరు రోజుల్లో కలిపి మొత్తంగా 7.20 కోట్లు వసూలు చేశాడు. 'జై సింహా' సినిమా తర్వాత బాలకృష్ణ- కెఎస్ రవికుమార్ సక్సెస్ఫుల్ కాంబోలో వచ్చిన సినిమా కావడంతో రూలర్ పై భారీ అంచనాలు నెలకొని ఈ ఎఫెక్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్‌పై పడింది. ఈ మేరకు మాంచి బిజినెస్ జరిగింది. కానీ విడుదలయ్యాక మార్కెట్ తలక్రిందులైనట్లుగా తాజా రిపోర్ట్‌ని బట్టి తెలుస్తోంది.
రోజువారి రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో రూలర్.. మొదటి రోజు 4.25 కోట్లు, రెండో రోజు 94 లక్షలు, మూడో రోజు 95 లక్షలు, నాలుగో రోజు 37 లక్షలు, ఐదో రోజు 30 లక్షలు, ఆరో రోజు 39 లక్షలు రాబట్టి మోతంగా 7.20 కోట్లు వసూలు చేసింది.
ఇంకా ఎంత రాబడితే సేఫ్?
ఏపీ తెలంగాణలో మొత్తంగా 21.25 కోట్ల రూపాయల మేర, కర్ణాటక, మిగితా రాష్ట్రాల్లో రూ.2.20 కోట్లు, ఓవర్సీస్లో 30 లక్షల రూపాయలతో కలిపి మొత్తంగా 23.75 కోట్ల బిజినెస్ జరిగింది. సో తెలుగు రాష్ట్రాల్లో రూలర్ లాభాల్లోకి రావాలంటే ఇంకా 14.05 కోట్ల పైగా రాబట్టాలి. వారం గడిచాక ఈ ఫిగర్ రాబట్టడమంటే అంత సులువేనా? మీరే అర్థం చేసుకోండి.