Chaavu kaburu challaga collections: కార్తీకేయ మూవీకి మంచి ఓపెనింగ్స్.. తొలి రోజు ఎంతంటే
టాలీవుడ్‌లో సినిమా రిలీజ్‌కు సంబంధించి ప్రతీవారం భారీ పోటీ కనిపిస్తుంది. ప్రతీవారం మూడుకుపైగా చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ప్రస్తుత శుక్రవారం (19 మార్చి) తేదీన భారీ పోటీని ఎదుర్కొంటూ చావు కబురు చల్లగా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా కలెక్షన్లు ఎలా ఉన్నాయి? ఎంత సాధిస్తే లాభాల్లోకి వస్తుందనే విషయంలోకి వెళితే...
హీరో కార్తికేయ లేటేస్ట్ ఫోటోషూట్ వైరల్.. చావు కబురు చల్లగా సక్సెస్‌పై కన్నేసిన యువ హీరో (ఫొటోలు)

చావు కబురు చల్లగా ప్రీ రిలీజ్ బిజినెస్
చావు కబురు చల్లగా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాం హక్కులు రూ.4.25 కోట్లు, సీడెడ్ రూ.2 కోట్లు, ఆంధ్ర రూ.6 కోట్లకు అమ్ముడుపోయాయి. మొత్తంగా నైజాం, ఆంధ్రా హక్కులు 12.25 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇక ఓవర్సీస్, ఇతర రాష్ట్రాల్లో రూ.80 లక్షల మేర బిజినెస్ జరిగింది. దాంతో ఈ సినిమా బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా రూ.13.5 కోట్ల మేర నమోదైంది.

భారీ సంఖ్యలో రిలీజ్
ఇక చావు కబురు చల్లగా సినిమా నైజాం, ఏపీలో భారీ సంఖ్యలో థియేటర్లలోకి రిలీజైంది. నైజాంలో 151 థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏపీలో 280 థియేటర్లలో విడుదలైంది. మిడిల్ రేంజ్ హీరో సినిమా ఈ సంఖ్యలో విడుదల కావడం చాలా అరుదుగా కనిపిస్తుంటుంది.

ఏపీ, తెలంగాణలో సానుకూలంగా ఒపెనింగ్స్
అయితే శుక్రవారం విడుదలైన చావు కబురు చల్లగా చిత్రం ఏపీ, తెలంగాణలో భారీ ఓపెనింగ్స్ సాధిస్తున్నట్టు సమాచారం. వైజాగ్, విజయవాడ, విజయనగరం, గోపాలపట్నం, నర్సన్నపేట, బొబ్బిలి, పలాస ప్రాంతాల్లో ఈ చిత్రం భారీగా ఒపెనింగ్స్ సాధించింది అనే రిపోర్టులు వస్తున్నాయి.

లాభాల్లోకి రావాలంటే ఎంత వసూలు చేయాలంటే
ఇక చావు కబురు చల్లగా సినిమా లాభాల్లోకి రావాలంటే భారీ టార్గెట్ అధిగమించాల్సి ఉంటుంది. రూ.13.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రకారం చూస్తే.. ఈ చిత్రం రూ.14 కోట్లు మేర ప్రపంచవ్యాప్తంగా రాబట్టాల్సిన అవసరం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

తొలి రోజు కలెక్షన్ల అంచనా
ఇదిలా ఉంటే మోసగాళ్లు, శశి సినిమాల పోటీ నుంచి తట్టుకొని చావు కబురు చల్లగా భారీ ఒపెన్సింగ్ నమోదయ్యాయి. అయితే ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రం 2 నుంచి 3 కోట్ల మధ్య కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్న నేపథ్యంలో ఏ రేంజ్‌లో ఈ చిత్రం వసూళ్లను రాబడుతుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











