»   » దిల్ రాజు కు రైట్స్ ...20న రిలీజ్

దిల్ రాజు కు రైట్స్ ...20న రిలీజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: రాజ్‌ తరుణ్‌, హెబ్బాపటేల్‌లు జంటగా నటించిన 'కుమారి 21 ఎఫ్‌' చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. ఈ విషయాన్ని రాజ్‌ తరుణ్‌ తన అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా తెలుపుతూ... ఓ కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు.

#Kumari21F Movie Releasing On Nov 20th !!!Watch Trailer Here ► bit.ly/Kumari21FTheatricalTrailer


Posted by Raj Tarun on 7 November 2015

సూర్యప్రతాప్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. సుకుమార్‌ రైటింగ్స్‌, పీఏ మోషన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై సుకుమార్‌ సమర్పిస్తున్నారు. ఈ చిత్రం నైజాం రైట్స్ తీసుకున్నట్లు సమాచారం.


ఆ ట్రైలర్ ని ఇక్కడ చూడండి.చిత్రం విశేషాలకు వెళ్తే..


కుమారి ఎవరు? 21 ఏళ్ల ఆ అమ్మాయి జీవిత గమనాన్ని మార్చిన సంఘటనలేమిటి? ఓ యువకుడితో ఆమెకు ఏర్పడిన పరిచయం ఎలాంటి పరిణామాలకు దారితీసింది? కుమారి గురించి ఆ యువకుడు తెలుసుకున్న నిజాలేమిటి? అనే విషయాలు తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు పల్నాటి సూర్యప్రతాప్. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం కుమారి 21 ఎఫ్.


ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథ, మాటలు, సంభాషణల్ని అందించడంతో పాటు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి విజయ్‌ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆడూరి నిర్మాతలు. రాజ్‌తరుణ్, హేబాపటేల్ జంటగా నటిస్తున్నారు.


DIL RAJU to distribute Kumari 21F

ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాల్ని తెలియజేస్తూ హృద్యమైన ప్రేమకథా చిత్రమిది. ఓ యువజంట ప్రేమ పయనంలో ఎలాంటి మలుపులు ఎదురయ్యాయి? వారి ప్రేమ చివరకు ఏ తీరాలకు చేరుకుంది? అనే అంశాలు ఆసక్తికరంగా వుంటాయి. ఆద్యంతం సుకుమార్ శైలిలో సాగే చిత్రమిది. దేవిశ్రీప్రసాద్ బాణీలు వినసొంపుగా ఉంటాయి.


DIL RAJU to distribute Kumari 21F

నోయల్, నవీన్, సుదర్శన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: అమర్‌రెడ్డి, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఛాయాగ్రహణం: రత్నవేలు.

English summary
"DIL RAJU" has bagged the distribution rights of "Kumari 21F" for Nizam area. The makers are planning for a grand release of the movie on 20th November.
Please Wait while comments are loading...