Don't Miss!
- News జగన్‌ను ఓడించడానికి ఒక్కటైన ఇద్దరు సీఎంలు
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘మన్మధుడు 2’ మూవీ కలెక్షన్ల పరిస్థితి ఏమిటి?
Recommended Video
అక్కినేని నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన 'మన్మధుడు 2' మూవీ తొలి రోజు డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమాపై ముందు నుంచి మంచి అంచనాలు ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ పర్వాలేదనే విధంగా ఉన్నాయి.
ప్రీ రిలీజ్ బజ్ కారణంగా తొలి రోజు ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.03 కోట్ల వసూలు చేసింది. అయితే మిక్డ్స్ రివ్యూల కారణంగా రెండో రోజు నుంచి వసూళ్లు డ్రాప్ అయ్యాయి. నైజాం ఏరియాతో పాటు సినిమా విడుదలైన అన్ని ఏరియాల్లోనూ పరిస్థితి ఇలానే ఉంది.
నైజాం ఏరియాలో ఎంత వసూలు చేసిందంటే?
‘మన్మధుడు 2' మూవీ నైజాం ఏరియాలో మూడో రోజు రూ. 54 లక్షల షేర్ వసూలు చేసింది. దీంతో 3 డేస్ నైజాం టోటల్ షేర్ రూ. 2.28 కోట్లకు రీచ్ అయింది. సోమవారం బక్రీద్ హాలిడే ఉండటంతో 4వ రోజు డీసెంట్ షేర్ వసూలయ్యే అవకాశం ఉంది.
ఓవర్సీస్ ఏరియాలో ఢమాల్
అయితే ఓవర్సీస్ ఏరియాలో ‘మన్మధుడు 2' మూవీ కలెక్షన్స్ దారుణంగా ఉంది. ఈ సినిమా ఇక్కడ ప్రీమియర్ షోల ద్వారా రూ. 82 వేల డాలర్లు రాబట్టింది. అయితే ఓవర్సీస్ మార్కెట్ రివ్యూల మీదే ఆధారపడి ఉంటుంది. మిక్డ్స్ రివ్యూలు, మౌత్ టాక్ కారణంగా శుక్రవారం 47 వేల డాలర్లు, ఆదివారం 61 వేల డాలర్లు రాబట్టింది. ఆదివారం మరీ దారుణంగా 22 వేల డాలర్లు మాత్రమే వసూలు చేసింది.
నాగార్జున గత చిత్రాలతో పోలిస్తే...
నాగార్జున గత చిత్రాలు సోగ్గాడే చిన్ని నాయనా, మనం, ఊపిరి చిత్రాలు ఓవర్సీస్ మార్కెట్లో మంచి వసూళ్లు రాబట్టాయి. అయితే ‘మన్మధుడు 2' మాత్రం ఆ సినిమాల స్థాయిలో ఓవర్సీస్ తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకోలేకపోయింది అనడానికి ఫస్ట్ వీకెండ్ వసూళ్లే నిదర్శనం.
స్లోగా జనాలకు ఎక్కుతుంది అనే నమ్మకంలో నాగార్జున
అయితే ‘మన్మధుడు 2' మూవీకి మిక్డ్స్ టాక్ వచ్చినప్పటికీ ఈ చిత్రం ప్రేక్షకులకు మెల్లిగా ఎక్కుతుంది అనే నమ్మకంతో ఉన్నారు నాగార్జున. గతంలో తన సూపర్ హిట్ చిత్రాలు గీతాంజలి, నిర్ణయం, అన్నమయ్య తొలివారం తర్వాత పుంజుకున్నాయని, మన్మధుడు 2 మూవీపై నమ్మకం ఉందని, ఓపెనింగ్స్ సంతృప్తికరంగా ఉన్నాయని తెలిపారు.