twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల.. వైకుంఠపురములో‌ మూవీపై పుష్ప ఎఫెక్ట్.. హిందీ రిలీజ్‌ వదంటూ నిర్మాతలు క్రేజీగా

    |

    అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా అల.. వైకుంఠపురములో బాక్సాఫీస్ వద్ద రెండు వందల కోట్ల భారీ కలెక్షన్స్ అందుకొని అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ సినిమా సక్సెస్ అనంతరం మిగతా భాషల్లో కూడా రీమేక్ చేయాలని కొందరు చాలా ప్రయత్నాలు చేశారు. అయితే ముందుగా బాలీవుడ్ ఇండస్ట్రీలో రీమేక్ చేసేందుకు సిద్దమైన విషయం తెలిసిందే అయితే ఇప్పుడు హిందీ డబ్బింగ్ రైట్స్ అందుకున్న గోల్డ్ మైన్స్ సంస్థ పుష్ప ప్రభావంతో అల వైకుంఠపురములో సినిమాను థియేటర్స్ లో విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. అలా చేస్తే రీమేక్ పై ప్రభావం పడుతుందని ఆ నిర్మాతలు గోల్డ్ మైన్స్ సంస్థకు ఒక ఆఫర్ కూడా చేసినట్లుగా తెలుస్తోంది.

    బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు

    బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు

    అల్లు అర్జున్ పూజ హెగ్డే జంటగా నటించిన అల వైకుంఠపురములో సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బిగ్ బడ్జెట్ మూవీకి అనుకున్నదానికంటే ఎక్కువ స్థాయి లోనే వసూళ్లు అందాయి. సినిమాకు మొదటి నుంచి పాటలతో మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవ్వడంతో బాక్సాఫీస్ వద్ద ఈజీగా రెండు వందల కోట్ల అందుకుంది. చాలావరకు నాన్ బాహుబలి రికార్డులను కూడా బ్రేక్ చేసేసింది.

    మంచి రేటింగ్స్

    మంచి రేటింగ్స్

    హిందీలో కూడా ఈ సినిమాకు డబ్బింగ్ రైట్స్ ద్వారా మంచి ప్రాఫిట్స్ వచ్చాయి. అయితే ఇప్పటికే టీవీలలో భారీస్థాయిలో రేటింగ్స్ అందుకుంటూ ఆ సినిమా అల్లు అర్జున్ స్థాయిని కూడా పెంచేసింది. సినిమా హిందీ డబ్బింగ్ హక్కులను గోల్డ్ మైన్స్ సంస్థ సొంతం చేసుకుంది. ఇక యూట్యూబ్లో అయితే ఇంతవరకు ఈ సినిమాను విడుదల చేయలేదు.

    బన్నీ సినిమాలన్నీ ఆ సంస్థకే..

    బన్నీ సినిమాలన్నీ ఆ సంస్థకే..


    ఒక పుష్ప సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో వసూళ్లను అందుకోవడంతో అల్లుఅర్జున్ పాత సినిమాలను కూడా వెండితెరపై విడుదల చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు అల్లు అర్జున్ సినిమాలన్నీ దాదాపు హిందీ చిత్ర పరిశ్రమకు చెందిన గోల్డ్ మైన్స్ సంస్థ సొంతం చేసుకుంది. ఆ సంస్థ యూట్యూబ్ , అలాగే టీవీలలో విడుదల చేసి భారీగా లాభాలను అందుకుంటోంది.

    అల..థియేట్రికల్ రిలీజ్..

    అల..థియేట్రికల్ రిలీజ్..

    ఇక రీసెంట్ గా గోల్డ్ మైన్స్ సంస్థ అల వైకుంఠపురములో సినిమాను డైరెక్ట్ గా బిగ్ స్క్రీన్ పై విడుదల చేయాలని ఒక నిర్ణయం తీసుకుంది. జనవరి 26వ తేదీన అల వైకుంఠపురములో హిందీ సినిమాను థియేటర్స్ లో భారీ స్థాయిలో విడుదల చేయాలని అఫీషియల్ గా క్లారిటీ కూడా ఇచ్చేశారు. ప్రస్తుతం ఈ సినిమా ట్యాగ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నార్త్ ప్రేక్షకులు ఈ సినిమాను కూడా వెండితెరపై చూసేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నట్లు అర్థమవుతోంది.

    రీమేక్ మూవీ..

    రీమేక్ మూవీ..

    అయితే ఇది వరకే హిందీ లో అల.. వైకుంఠపురములో సినిమాను రీమేక్ చేయనున్నట్లు వర్క్ కూడా స్టార్ట్ చేశారు. టాలీవుడ్ చిత్ర నిర్మాత అల్లు అరవింద్ బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ తో కలిసి షేహజధ అనే టైటిల్ తో ఈ సినిమాను రీమేక్ చేసేందుకు షూటింగ్ కూడా మొదలుపెట్టారు. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది.

    గోల్డ్ మైన్స్ కు ఆఫర్..

    గోల్డ్ మైన్స్ కు ఆఫర్..

    హటాత్తుగా అల వైకుంఠపురములో సినిమాను హిందీలో థియేటర్స్ లో విడుదల చేస్తున్నట్లు తెలియడంతో షేహజధ నిర్మాతలు గోల్డ్ మైన్స్ ఫిలిమ్స్ తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. నిజానికి గోల్డ్ మైన్స్ సంస్థ థియేటర్లలో సినిమాను విడుదల చేసుకోవడానికి సర్వ హక్కులు కలిగి ఉంది. అయితే అలా చేస్తే రీమిక్ సినిమాపై ప్రభావం పడుతుంది అని చిత్ర నిర్మాతలు గోల్డ్ మైన్స్ కు ఎనిమిది కోట్ల వరకు ఆఫర్ చేసినట్లుగా సమాచారం. కానీ గోల్డ్ మైన్స్ సంస్థ అందుకు ఒప్పుకోవడం లేదనీ తెలుస్తోంది. ఈ విషయంలో నిర్మాతలు ఇంకా మరో ఆఫర్ ఏమైనా ప్రకటిస్తారో లేదో చూడాలి.

    English summary
    Ala Vaikunthapurramuloo hindi theatrical release tension in remake unit
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X