డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కి మూడు టాలీవుడ్ సినిమాలు రెడీ.. ఏ సినిమాలంటే?
కరోనా కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో భారత దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.. ఈ నేపథ్యంలో థియేటర్లు ఇప్పట్లో ఓపెన్ అయ్యే అవకాశం అయితే కనిపించడం లేదు.. లాక్ డౌన్ కారణంగా జనం అంతా ఇళ్లకే పరిమితమయ్యారు.. ఇప్పుడు వరుసగా చాలా సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా తెలుగు నుంచి అయితే దాదాపు మూడు సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

రిలీజ్ ఖాయం
గత ఏడాది కరోనా కారణంగా చాలా ఇబ్బందులు పడిన టాలీవుడ్ తర్వాత కాస్త కోలుకుంది. ఈ ఏడాది మొదట్లో రిలీజ్ అయిన క్రాక్ సినిమా మొదలు మరో రెండు మూడు హిట్ సినిమాలు టాలీవుడ్ ఖాతాలో పడ్డాయి. ఈ లోపు మళ్ళీ మహమ్మారి విజృంభించడంతో థియేటర్లు మూసివేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకే లాక్ డౌన్ కూడా విధించారు. అయితే తెలుగులో చాలా సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతాయని ప్రచారం జరుగుతోంది. మరీ ముఖ్యంగా మూడు సినిమాలు మాత్రం కచ్చితంగా ఓటీటీలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

దృశ్యం 2
వెంకటేష్ హీరోగా తెరకెక్కిన మలయాళ రీమేక్ సినిమా దృశ్యం 2 షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ కూడా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయి మంచి హిట్ అయ్యింది. ఈ తెలుగు వర్షన్ కూడా అమెజాన్ ప్రైమ్ కి అమ్మేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని అంటున్నారు.

మ్యాస్ట్రో
ఇక నితిన్ హీరోగా నటిస్తున్న మ్యాస్ట్రో సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నిర్మాణ సంస్థ ఒక ప్రముఖ ఓటీటీతో డీల్ కుదుర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తోందని, ఒకవేళ డీల్ ఫైనల్ అయితే త్వరలోనే రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
Recommended Video

పాగల్
ఇక దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన విశ్వక్సేన్ సినిమా పాగల్ కూడా డిజిటల్ రిలీజ్ చేయడానికి ఆసక్తిగా చూపిస్తున్నారని తెలుస్తోంది. అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ సంస్థ కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా ఒకసారి పూర్తి కాగానే అధికారిక ప్రకటన వెలువడుతుందని అంటున్నారు. అలాగే జూన్ నెలలో ఈ సినిమా స్ట్రీమ్ అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.


Click it and Unblock the Notifications











