Don't Miss!
- News రేవంత్ రెడ్డి సీటుకు భలే డిమాండ్
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బాలయ్యతో హిట్టు కొడితే మహేష్ బాబు ఫ్రీ.. మాస్ దర్శకుడికి బంపర్ ఆఫర్!
సంక్రాంతి సీజన్ లో క్రాక్ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ సినిమా ఇచ్చిన విజయంతోనే టాలీవుడ్ లో సినిమాలు వరుసగా సక్సెస్ తో ముందుకు వెళుతున్నాయి. దర్శకుడు గోపిచంద్ మలినేని మొదటిసారి ఇండస్ట్రీలో తన స్థాయిని మరింత పెంచుకున్నాడు. అయితే నెక్స్ట్ ఈ దర్శకుడి నుంచి రాబోతున్న సినిమాపై కూడా అంచనాలు గట్టిగానే ఉంటాయని చెప్పవచ్చు. ఇక మహేష్ బాబుతో కూడా ప్లాన్ వేస్తున్నట్లు టాక్.
శాకుంతలగా సమంత అక్కినేని.. గుణశేఖర్ దర్శకత్వంలో క్రేజీ ప్రాజెక్ట్ ప్రారంభం (ఫొటోలు)
భవిష్యత్తులో మెగాస్టార్ తో..
క్రాక్ సినిమా ఇచ్చిన సక్సెస్ తో గోపీచంద్ మలినేనికి బడా నిర్మాతల నుంచి ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. ముందుగా మెగాస్టార్ నుంచి పిలుపు వచ్చిన విషయం తెలిసిందే. తప్పకుండా భవిష్యత్తులో సినిమా చేద్దామని మెగాస్టార్ ఒక మాట కూడా అన్నట్లు రూమర్స్ వచ్చాయి.
ఆ పనులు ఇంకా పూర్తవ్వలేదు
ఇక బడా ప్రొడక్షన్ హౌజ్ మైత్రి మూవీ మేకర్స్ గోపిచంద్ తో ఒక ప్రాజెక్ట్ సెట్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. బాలకృష్ణను హీరోగా సెలెక్ట్ చేసుకున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశారు. అయితే స్క్రిప్ట్ పనులు ఇంకా పూర్తి స్థాయిలో సెట్టవ్వలేదు. వీలైనంత త్వరగా ఫుల్ స్క్రిప్ట్ ను రెడీ చేసి సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలని అనుకుంటున్నారు.
శశి ప్రీరిలీజ్ ఈవెంట్: రానా దగ్గుబాటి, నాగ శౌర్య , సందీప్ కిషన్ హాజరు (ఫొటోలు)
హిట్టు కొడితే మహేష్ తో సినిమా
అయితే మైత్రి మూవీ మేకర్స్ గోపిచంద్ కు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బాలకృష్ణతో చేయనున్న సినిమా హిట్టయితే తప్పకుండా మహేష్ బాబుతో సినిమా చేసే అవకాశం కూడా ఇవ్వనున్నట్లు మాట ఇచ్చారట. దీంతో దర్శకుడు బాలయ్య సినిమాను చాలా పవర్ఫుల్ గా రెడీ చేస్తున్నట్లు సమాచారం. కాస్త లేటయినా కూడా హిట్టు గ్యారెంటీ అనే స్క్రిప్ట్ తో సిద్ధమవ్వాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.
మహేష్ బాబు థియేటర్ లో ముగ్గురు జాతిరత్నాలు సందడి: రచ్చరచ్చ చేశారు (ఫొటోలు)
మరో సినిమా చేయడానికి..
మైత్రి మూవీ మేకర్స్ లో ఇప్పటికే 10కి పైగా బిగ్ బడ్జెట్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. బడా హీరోలను ఫామ్ లో ఉన్న దర్శకులను మిక్స్ చేసి సినిమాలను గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. ఇక మహేష్ బాబుతో ఇప్పటికే సర్కారు వారి పాట చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్ మరో సినిమా చేయడానికి కమిట్మెంట్ కూడా తీసుకుంది. అందుకే ఇప్పుడే దర్శకుడిని సెలెక్ట్ చేసుకోవాలని గోపిచంద్ మలినేనికి చెప్పారట. మరి ఆ దర్శకుడు బాలయ్యతో హిట్టు కొట్టి మరో సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి.