Don't Miss!
- Automobiles విమానంలో ప్రేమ కావ్యం.. అద్భుతమైన సన్నివేశానికి ఫిదా అవుతున్న నెటిజన్లు
- Finance Uday Kotak: కోటక్ బ్యాంక్ స్టాక్ క్రాష్.. పాపం ఉదయ్ కోటక్.. ఎంత నష్టపోయారంటే..
- Sports కోహ్లి.. అసలు ఇదేం బ్యాటింగ్- సునీల్ గవాస్కర్
- News రేవంత్ రెడ్డి సీటుకు భలే డిమాండ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రభాస్ రాధేశ్యామ్ కోసం ఆస్కార్ విన్నర్.. మళ్ళీ కన్ఫ్యూజన్?
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా ఆడియెన్స్ ముందుకు వచ్చే వరకు కొన్ని విషయాల్లో క్లారిటీ వచ్చేలా లేదు. ఒక సినిమా సెట్స్ పైకి వస్తే ప్రణాళికలతో సరైన టీమ్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ వందల కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసే ప్రభాస్ మాత్రం ఆ విషయంలో కాస్త కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేస్తున్నాడు. సాహో మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో ఎలాగైతే చేశారో ఇప్పుడు రాధేశ్యామ్ మ్యూజిక్ విషయంలో కూడా అదే తరహాలో నడుచుకుంటున్నారు.
రాధే శ్యామ్ సినిమా సెట్స్ పైకి వచ్చి దాదాపు ఏడాది అవుతోంది. కానీ ఇంకా ఫుల్ ప్లాన్ రెడీ అవ్వలేడు. కేవలం కథను కొన్ని పాత్రలను సెట్ చేసుకొని షూటింగ్ చేస్తున్నారు. ఇక ఇటీవల ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే ముందు సినిమాకు జూలియస్ ప్యాకియంను మ్యూజిక్ డైరెక్టర్ గా సెట్ చేసుకున్నట్లు టాక్ వచ్చింది. కానీ ఫస్ట్ లుక్ పోస్టర్ లో క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఇప్పుడు ఆస్కార్ విన్నర్ ని లైన్ లో పెట్టె ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇండియన్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్.రెహమాన్ ఈ కథకు మంచి మ్యూజిక్ ఇస్తాడాని ప్రభాస్ యూవీ క్రియేషన్స్ కి చెప్పినట్లు తెలుస్తోంది. ఎందుకంటే రెహమాన్ అంటే ప్రభాస్ కి చాలా ఇష్టం. చాలా సార్లు రెహమాన్ తో మ్యూజిక్ చేయించుకోవాలని అనుకున్నాడు. ఇక ఇప్పుడు రాధేశ్యామ్ ద్వారా ఆయనపై కన్నేసినట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.